ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rohit Sharma: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా అవతరణ

ABN, Publish Date - Jun 06 , 2024 | 07:48 AM

అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాది రిటైర్డ్ హర్ట్‌‌గా వెనుతిరిగాడు. అయినప్పటికీ సంచలన రికార్డు సృష్టించాడు.

Rohit Sharma

అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాది రిటైర్డ్ హర్ట్‌‌గా వెనుతిరిగాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ఐర్లాండ్‌పై కొట్టిన మూడు సిక్సర్లతో రోహిత్ శర్మ సిక్సుల సంఖ్య 600లకు చేరింది.


అంతేకాదు పురుషుల టీ20 క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక గత మ్యాచ్‌లో చేసిన 52 పరుగులతో టీ20 ప్రపంచ కప్‌లో 1,000 పరుగుల మార్కును హిట్‌మ్యాన్ అందుకున్నాడు. కాగా ఈ జాబితాలో మహేల జయవర్ధనే, విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మకు ఇది 10వ 50-ప్లస్ స్కోరు కావడం విశేషం. ఈ జాబితాలో కోహ్లీ 14 ప్లస్ స్కోర్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. తొమ్మిది 50 ప్లస్ స్కోర్లతో క్రిస్ గేల్‌ మూడవ స్థానానికి పడిపోయాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు ..

1.రోహిత్ శర్మ (భారత్) - 600

2. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 553

3. షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) - 476

4. బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)- 398


టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు

1. విరాట్ కోహ్లీ (భారత్)- 1142 పరుగులు (26 మ్యాచ్‌లు).

2. మహేల జయవర్ధనే (శ్రీలంక)- 1016 పరుగులు (31 మ్యాచ్‌లు)

3. రోహిత్ శర్మ (భారత్) - 1015 పరుగులు (37 మ్యాచ్‌లు)

4. క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 965 పరుగులు (31 మ్యాచ్‌లు)


టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల వీరులు..

1. విరాట్ కోహ్లీ - 4038 పరుగులు (110 మ్యాచ్‌లు)

2. రోహిత్ శర్మ - 4026 పరుగులు (144 మ్యాచ్‌లు)

3. బాబర్ ఆజం - 4023 పరుగులు (112 మ్యాచ్‌లు)


ఇక బుధవారం రాత్రి న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 97 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఈ లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలోనే ఛేదించింది. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా రాణించగా.. బ్యాటింగ్ రోమిత్ శర్మ, పంత్ ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

T20 World Cup India vs Ireland : బోణీ అదిరింది..!

భారత ఫ్యాన్స్‌కు అనుకూలంగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సమయాలు

For mor Sports News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 07:50 AM

Advertising
Advertising