ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: భారత్‌ను భయపెడుతున్న సౌతాఫ్రికా.. కంగారూల కంటే డేంజర్‌గా ఉన్నారు

ABN, Publish Date - Nov 30 , 2024 | 07:32 PM

Rohit Sharma: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టు బెండు తీస్తోంది. కంగారూలను వణికిస్తోంది. మనతో మ్యాచ్ అంటే జడుసుకునేలా చేస్తోంది. అయితే రోహిత్ సేనను మరో టీమ్ భయపెడుతోంది. అదే సౌతాఫ్రికా.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టు బెండు తీస్తోంది. కంగారూలను వణికిస్తోంది. మనతో మ్యాచ్ అంటే జడుసుకునేలా చేస్తోంది. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టును దారుణంగా ఓడించింది మెన్ ఇన్ బ్లూ. సొంతగడ్డపై ఇంత ఘోర ఓటమిని ఆ జట్టు ఆటగాళ్లు, సీనియర్లే కాదు.. ఆ జట్టు అభిమానులు కూడా ఊహించలేదు. ఇదే జోరులో వరుస మ్యాచుల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఒకవైపు రోహిత్ సేనను చూసి ఆసీస్ వణుకుతుంటే.. మరోవైపు సౌతాఫ్రికాను చూసి మన జట్టు భయపడుతోంది. అంతగా ప్రొటీస్‌ను చూసి హిట్‌మ్యాన్ అండ్ కో ఎందుకు జంకుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..


దూసుకొచ్చిన సౌతాఫ్రికా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో సౌతాఫ్రికా దూసుకొచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ప్రొటీస్. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా (57.69 శాతం)ను సౌతాఫ్రికా (59.26 శాతం) దాటేసింది. దీంతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న భారత్ (61.11 శాతం)లో భయం మొదలైంది. ప్రొటీస్ ఉన్న దూకుడుకు త్వరలో టాప్ ప్లేస్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఓడితే బెర్త్ మిస్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గనుక టీమిండియా నెగ్గితే టాప్ ప్లేస్‌ కంటిన్యూ అవుతుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే మన లీడ్ మరింత సాలిడ్ అవుతుంది. అదే ఒకవేళ ఓడితే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోవడం ఖాయం. రోహిత్ సేన ఓడితే సౌతాఫ్రికా అగ్రస్థానానికి, ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంటాయి. అదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఛాన్స్ మిస్ అవుతుంది. అందుకే సౌతాఫ్రికాను చూసి హిట్‌మ్యాన్ భయపడుతున్నాడు. ఇన్నాళ్లూ భారత్-ఆస్ట్రేలియా మాత్రమే ఫైనల్ బరిలో ఉంటాయని భావిస్తే.. ఇప్పుడు ప్రొటీస్ రేసులోకి వచ్చింది. దీంతో బీజీటీలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరి.. ఈ ఛాలెంజ్‌ను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


Also Read:

ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..

డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్.. అశ్విన్ ఇలా అనేశాడేంటి

దిగొచ్చిన పాకిస్థాన్.. బీసీసీఐ దగ్గర తోకజాడిస్తే ఇలాగే ఉంటుంది

For More Sports And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 07:33 PM