Rohit Sharma: రోహిత్ శర్మ విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం సరైనది: సౌరవ్ గంగూలీ
ABN, Publish Date - Feb 20 , 2024 | 01:42 PM
జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సారథ్యం వహించడానికి రోహిత్ శర్మకు తన ఆశీస్సులు అందించాడు.
జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సారథ్యం వహించడానికి రోహిత్ శర్మకు తన ఆశీస్సులు అందించాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడం ఉత్తమ ఎంపిక అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడం సరైన నిర్ణయం. 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 10 మ్యాచ్‌లు గెలిపించిన తీరు ఇప్పటికీ మన మదిలో మెదులుతోంది. కాబట్టి రోహిత్ ఉత్తమ ఎంపిక ”అని అన్నాడు.
కాగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాతి నుంచి రోహిత్ శర్మను టీ20 జట్టుకు దూరం పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉంటాడని అంతా భావించారు. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టును నడిపించిన విధానం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న సెలెక్టర్లు అతనికి మరో అవకాశం ఇచ్చారు. టీ20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నట్టు ఇటీవల ఓ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 20 , 2024 | 01:53 PM