Rohit Sharma: ఏ తండ్రైనా రోహిత్ లాగే ఆలోచిస్తాడు.. ఆసిస్‌తో టెస్టుపై వీడని డైలమా
ABN, Publish Date - Nov 14 , 2024 | 01:10 PM
ఆసిస్ పర్యటనకు రోహిత్ వస్తాడా లేక కెప్టెన్ ను మారుస్తారా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది..
ముంబై: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో కఠోర శిక్షణను ప్రారంభించింది. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా పెర్త్ చేరుకోలేదు. దీంతో అసలు కెప్టెన్ ఈ టెస్టులో పాల్గొంటాడా లేదా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. రోహిత్ భార్య రెండో కాన్పు కారణంగా అతడు భారత్ లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. కానీ, ముంబై నెట్స్ లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను అతడి పీఆర్ టీం షేర్ చేయడంతో ఈ హిట్ మాస్టర్ ఆసిస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడనే సంకేతాలు అందుతున్నాయి. రోహిత్ ఆస్ట్రేలియా చేరకునే విషయంపై క్లారిటీ లేపప్పటికీ ఈ పరిస్థితుల్లో ఏ తండ్రి అయినా తన భార్య, కుటుంబంతో కలిసి ఉండాలనే కోరుకుంటాడు. రోహిత్ ఆ నిర్ణయమే తీసుకుంటాడు. రోహిత్ ఇప్పటికే టెస్టు సిరీస్ కు ట్యూన్ అయ్యి ఉన్నాడు. తనకు సాధ్యమయ్యే ప్రతి అవకాశాన్ని అతను ఉపయోగించుకోగలడు అని సన్నిహిత అధికారులు పేర్కొన్నారు.
అంతకుముందు, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ దూరమైతే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కోచ్ గంభీర్ సైతం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రోహిత్ పూర్తిగా ఇంటికే పరిమితం చేసి కొత్త కెప్టెన్ ను నియమించాలన్నాడు. దీనికి ఆసిస్ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ వ్యతిరేకించాడు. కెప్టెన్ ను మార్చడం కరెక్ట్ కాదన్నాడు. ఫించ్ పోస్టును లైక్ చేసిన రోహిత్ భార్య.. అందుకు రోహిత్ భార్య మద్దతు తెలిపింది.
రోహిత్ గైర్హాజరీతో యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి భారత్ ఎతో టీమ్‌ఇండియా ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్కడి పరిస్థితులకు అలవాటుపడేలా వాకా స్టేడియంలో పిచ్‌ను సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది.
తిలక్ తుఫాన్
Updated Date - Nov 14 , 2024 | 01:10 PM