Anshuman Gaekwad: గైక్వాడ్ మృతి తీరని లోటు
ABN, Publish Date - Aug 01 , 2024 | 12:51 PM
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌కు లండన్‌లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌కు లండన్‌లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
క్యాన్సర్‌తో పోరాడి..
అన్షుమన్ గైక్వాడ్‌కు క్యాన్సర్ సోకింది. క్యాన్సర్‌కు వడోదరలో చికిత్స తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరయిన ట్రీట్ మెంట్ అందలేదు. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ఆ వెంటనే బోర్డు కార్యదర్శి జై షా స్పందించారు. వైద్య కోసం సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇంతలో గైక్వాడ్ పరిస్థితి విషమించి కన్నుమూశారు.
మోదీ సంతాపం
గైక్వాడ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ‘అన్షుమన్ గైక్వాడ్ మృతి నన్ను బాధించింది. క్రికెట్ కోసం అన్షుమన్ గైక్వాడ్ చేసిన కృషి భావితరాలకు గుర్తుండిపోతుంది. గైక్వాడ్ ప్రతిభ గల ఆటగాడు. ఉత్తమ్ కోచ్. గైక్వాడ్ మృతి క్రికెట్ కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని’ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఆటగాడిగా, కోచ్‌గా
అన్షుమన్ గైక్వాడ్ మృతిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘భారత క్రికెట్ జట్టుకు ఆటగాడిగా, సెలెక్టర్‌గా, కోచ్‌గా అన్షుమన్ గైక్వాడ్ పనిచేశారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు. గైక్వాడ్ 40 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడారు. రెండు దశాబ్ధాల్లో 205 ఫస్ట్ క్లాస్ గేమ్స్ గైక్వాడ్ ఆడారు. తర్వాత కోచ్‌గా పనిచేశారు. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని కోరుతున్నా అని’ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అన్షుమన్ గైక్వాడ్ మృతిపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ట్వీట్ చేశారు.
Read More Sports News and Latest Telugu News
Updated Date - Aug 01 , 2024 | 12:51 PM