ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanju Samson: సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:06 PM

సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..

Sanju Samson

డర్బన్: సౌతాఫ్రికా దండయాత్రకు చెక్ పెడుతూ మెరుపు దాడులతో విజృంభించిన సంజూ శాంసన్ పై ప్రశంసల వర్షం కరుస్తోంది. మాజీ క్రికెటర్లు సైతం అతడిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. సంజూ సెంచరీ కొట్టిన వెంటనే సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


శుక్రవారం డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరిగిన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 సందర్భంగా సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతులను తన బ్యాట్ తో గాల్లోకి గిరవాటు వేస్తూ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడి ఆటను చూస్తూ ప్రశాంతంగా ఉండలేకపోయిన మాజీ క్రికెటర్లు సంజూని అభినందిస్తూ పోస్టులు చేశారు. వీరిలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. స్ట్రోక్ ప్లేలో అద్భుతమైన ప్రదర్శన చేసిన సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా చూసుకుంటే సంజూ ఈ లిస్టులో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.


ఓపెనర్‌గా దిగిన సంజూ 50 బంతుల్లో 107 పరుగులు చేసి తనకు తిరుగులేదని నిరూపించాడు. 10 సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ రోహిత్‌ రికార్డును తిరగరాశాడు. 7 ఫోర్లు చేసి తన టీ20 కెరీర్‌లో రెండో శతకాన్ని బాదాడు. అభిషేక్‌ శర్మ (7) రెండంకెల పరుగులు చేయలేకపోగా.. హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ భారీ పరుగులు చేసే ప్రయత్నంలో క్యాచ్‌ ఇచ్చేసి 33 పరుగులకు పరిమితమయ్యాడు. బర్త్‌ డే రోజు చిరస్మరణీయ బ్యాటింగ్‌ ఆశించగా తిలక్‌కు నిరాశ మిగిలింది. సూర్య కుమార్‌ యాదవ్‌ (21), రింకూ సింగ్‌ (11) పరుగులతో పర్వాలేదనిపించాడు. హార్దిక్‌ పాండ్యా (2) తీవ్ర నిరాశపర్చగా.. అక్షర్‌ పటేల్‌ (7) బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు.


శాంసన్ 47 బంతుల్లో తన సెంచరీని చేరుకున్నాడు, ఇది దక్షిణాఫ్రికాపై భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ, టీమిండియా క్రికెటర్ ఆరవ వేగవంతమైన టీ20. శాంసన్ ఉత్కంఠభరితమైన నాక్ తర్వాత, శాస్త్రి, యువరాజ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘సంజూ నువ్వు అద్భుతం.. స్ట్రోక్ ప్లే చూడటం గొప్పగా అనిపించింది’’ అని యువరాజ్ సింగ్ ఎక్స్ వేదికగా తెలిపాడు. ‘‘సంజూ.. నువ్వు చాలా స్పెషల్’’ అంటూ రవిశాస్త్రి అభినందించాడు.

Also Read:

రోహిత్ సావాసంతో అదే నేర్చుకున్నా.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శుభవార్త చెప్పిన కేఎల్ రాహుల్ జంట.. ఖుషీలో అభిమానులు

గంభీర్‌కు రోహిత్ భయం.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదే

For More Sports And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 12:08 PM