BCCI-Shashi Tharoor: బీసీసీఐ సెలక్టర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం
ABN, Publish Date - Jul 19 , 2024 | 01:10 PM
ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.
ఈ నెల చివరి నుంచి శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం గురువారం రాత్రి జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీపై సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. స్వతహాగా క్రికెట్ అభిమాని అయిన ఆయన పలువురు ఆటగాళ్ల విషయంలో సెలక్టర్ల వైఖరిని ఆయన తప్పుబట్టాడు. వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు, టీ20 జట్టులోకి అభిషేక్ శర్మను తీసుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు.
‘‘ఈ నెలాఖరును శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ఆసక్తికరంగా అనిపిస్తోంది. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ కొట్టిన సంజూ శాంసన్‌ను వన్డేల్లోకి తీసుకోలేదు. ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20సిరీస్‌లో సెంచరీ బాదిన కుర్రాడు అభిషేక్ శర్మని టీ20లకు ఎంపిక చేయలేదు. భారత జెర్సీలో విజయవంతమైన ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు చిన్నచూపు చూడడం చాలా అరుదు. ఏదైతేనేం గుడ్‌లక్ టీమిండియా ’’ అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
కాగా శ్రీలంకతో జరిగిన పొట్టి సిరీస్‌కు సంజూ శాంసన్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే సిరీస్‌కు మాత్రం పక్కనపెట్టారు. ఇక ఇటీవలే ముగిసిన జింబాబ్వేతో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యంగ్‌స్టార్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. ఒక సెంచరీ కూడా బాది ఆకట్టుకున్నాడు. కాగా శ్రీలంకతో సిరీస్ కోసం గురువారం రాత్రి బీసీసీఐ రెండు ఫార్మాట్లకు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. శుభ్‌మాన్ గిల్ వైఎస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక వన్డే జట్టుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌కు కూడా చోటుదక్కిన విషయం తెలిసిందే.
జట్లు ఇవే..
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
ఇవి కూడా చదవండి
గంభీర్, కోహ్లీ కలిసి పని చేస్తారా? వారిద్దరూ బీసీసీఐకి ఇచ్చిన క్లియర్ మెసేజ్ ఏంటంటే..!
ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడానికి మార్గాలున్నాయా? అలా చేస్తేనే ఇక ఛాన్స్..!
For more Sports News And Telugu News
Updated Date - Jul 19 , 2024 | 01:17 PM