ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shikhar Dhawan: భార్యతో విడాకులు.. ప్రేయసితో కెమెరాకు చిక్కిన క్రికెటర్..

ABN, Publish Date - Nov 04 , 2024 | 06:13 PM

వివాహబంధం నుంచి బయటికొచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో ఓ విదేశీ మహిళతో శిఖర్ ధావన్ కనిపించడంతో వీడియో వైరలవుతోంది.

Shikhar Dhawan

ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే భార్యతో మనస్పర్థల కారణంగా కోర్డుకెక్కిన ఈ క్రికెటర్ చాలాకాలం పాటు వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఆటకు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఎయిర్ పోర్టులో ఓ విదేశీ యువతితో కలిసి ఈ మాజీ ఓపెనర్ కెమెరా కంటికి చిక్కాడు. ఇంతకీ శిఖర్ తో ఉన్న ఈ మిస్టరీ గర్ల్ ఎవరనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. భార్యా బిడ్డలకు దూరమైన ఈ క్రికెటర్ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతోందంటూ అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రికెటర్ మరోసారి పెళ్లికి రెడీ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


భార్యకు విడాకులు..

2012లో శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్‌ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ఈ క్రికెటర్ పై నెట్టింట చాలాసార్లు రిలేషన్ షిప్ కు సంబంధించిన రూమర్లు వచ్చాయి.


కెరీర్ విషయానికొస్తే.. తన 13 ఏళ్ల కెరీర్లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2010లో ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో వైజాగ్ లో భారత్ తరఫేర తొలి వన్డే ఆడాడు. తన కెరీర్ లో 167 మ్యాుల్లో 6793 పరుగులు చేశాడు. వన్డేల్లో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ కెరీర్ లో మొహాలీలో ఆస్టరేలయాతో తొలి టెస్టు ఆడాడు. 2018లో శిఖర్ ధవన్ చివరి టెస్టు ఆడాడు. మొత్తం 34 టెస్టులు ఆడిన ధావన్ ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు 190 పరుగులు చేశాడు. టీ 20ల్లో ధావన్ 68 మ్యాచుల్లో 1759 పరుగులు చేశాడు. 11 హాఫ్ సెంచరీలు సాధించాడు.

IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..


Updated Date - Nov 04 , 2024 | 06:13 PM