Sourav Ganguly: శ్రేయాస్, కిషన్ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైనదే.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 29 , 2024 | 03:31 PM
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్ క్లాక్ క్రికెట్ ఆడకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో రంజీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వారమని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. కాగా తమ ఆదేశాల మేరకు రంజీ ట్రోఫీలో ఆడని శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను 2024 సంవత్సరానికి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. గతంలో శ్రేయాస్ అయ్యర్ గ్రేడ్ బీలో, ఇషాన్ కిషన్ గ్రేడ్ సీలో ఉన్నారు. టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా ఉన్న ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్‌తో గంగూలీ మాట్లాడుతూ.. ‘‘వారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కోరుకుంటోంది. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫి ఆడకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది. కానీ ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. వారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోవడం తప్పు. మీరు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆడాలని బోర్డు భావిస్తుంది. అయితే శ్రేయాస్ అయ్యర్ మరో రెండు రోజుల్లో ముంబై జట్టు ఆడే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ నన్ను ఆశ్చర్యపరిచాడు. వారు యువకులు. భారత జట్టులో అన్ని ఫార్మాట్లలో భాగంగా ఉన్నారు. ఐపీఎల్‌లో కూడా కాంట్రాక్టును కలిగి ఉన్నారు. అయితే కిషన్ ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు. ముఖ్యంగా కిషన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు తప్పనిసరిగా ఆడాలి. బీసీసీఐ ఒక బలమైన వైఖరిని తీసుకుంది. అది న్యాయంగానే ఉంది. మీరు బోర్డుతో ఒప్పందం చేసుకున్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. నేను ఆడే రోజుల్లో రజీ ట్రోఫీ ప్రధాన టోర్నీగా ఉండేది. ఇది ప్రధాన టోర్నమెంట్. రంజీ ట్రోఫీ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపికలు జరుగుతాయి. సహజంగానే అక్కడ ఐపీఎల్ పరిగణనలోకి తీసుకోరు. రంజీ ట్రోఫి అత్యంత ముఖ్యమైన టోర్నీ అని నేను భావిస్తున్నాను.’’ అని చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 04:54 PM