IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN, Publish Date - Jul 30 , 2024 | 07:53 PM
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించి, ఆతిథ్య జట్టుని చిత్తుచిత్తుగా ఓడించింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
మరోవైపు.. శ్రీలంక మాత్రం ఈ మూడో మ్యాచ్‌లో అయినా నెగ్గాలని చూస్తోంది. స్వదేశంలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకలేకపోయారన్న ముద్ర తమపై పడకుండా ఉండాలని భావిస్తోంది. ఆ దిశగానే ఆటగాళ్లు కసిగా రంగంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మూడో మ్యాచ్‌లో గెలుపొంది, 2-1 తేడాతో సిరీస్‌ని ముగించి, తమ పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లో జరిగిన లోపాలను సవరించుకొని.. తమ సత్తా చాటాలని చూస్తున్నారు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుపొందుతారో? ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో వేచి చూడాలి.
ఇదిలావుండగా.. మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు జోరుగా వర్షం కురవడంతో మూడో టీ20 ఆలస్యం అయ్యింది. నిర్దేశిత సమయానికే వర్షం ఆగినా.. మైదానం చిత్తడిగా మారడంతో, మైదానంను సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైంది. ఈ క్రమంలోనే టాస్ ఆలస్యమైంది. పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత 7:40 గంటలకు టాస్ వేశారు. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభించారు. కాగా.. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది కాబట్టి, మ్యాచ్ ఓడినా ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, భారత్ క్లీన్ స్వీప్ దిశగానే అడుగులు వేస్తోంది.
తుది జట్లు
శ్రీలంక: నిస్సాంకా, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కామిందు మెండిస్, అసలంక, విక్రమసింఘే, వనిందు హసరంగ, రమేశ్ మెండిస్, మతీష్ తీక్షణ, పాతిరానా, ఫెర్నాండో
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ఖలీల్ అహ్మద్
Updated Date - Jul 30 , 2024 | 07:53 PM