Team India: తెరపైకి దులీప్ ట్రోఫీ అంశం.. చిక్కుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు
ABN, Publish Date - Nov 04 , 2024 | 03:42 PM
దులీప్ ట్రోఫీ అంశం టీమిండియా స్టార్ల మెడకు చుట్టుకుంది. ఈ దేశీయ మ్యాచ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన ఆటగాళ్ల సన్నద్ధతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీనికి ముందు భారత్ 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అదే సమయంలో, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల సన్నాహాల్లో భాగంగా దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్ , జస్ప్రీత్ బుమ్రా పాల్గొనాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో దానిని వీరంతా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కివీస్ చేతిలో ఓటమి తర్వాత దులీప్ ట్రోఫీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. స్టార్ ఆటగాళ్లంతా ఈ దేశీయ పోటీలో పాల్గొనకపోవడం వల్లే భారత జట్టు తీవ్రంగా నష్టపోయిందని మండిపడుతున్నారు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే ఓటమికి అతిపెద్ద కారణంగా మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో కోహ్లి, రోహిత్, అశ్విన్, బుమ్రా నలుగురూ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించారని, అయితే తర్వాత తాము రెస్ట్ తీసుకుంటామని చెప్పి ఇందులో పాల్గొనలేదని తెలుస్తోంది.
ఆ వార్త ఇప్పుడు వైరల్..
బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు దులీప్ ట్రోఫీలో పాల్గొనమని బీసీసీఐ కోహ్లి, రోహిత్‌లను కోరింది. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు అలసట కారణంగా బీసీసీఐ అభ్యర్థనను తిరస్కరించారు. విరాట్,రోహిత్ మాత్రమే కాదు, అశ్విన్, జడేజాలను కూడా దులీప్ ట్రోఫీలో ఆడమని అజిత్ అగార్కర్ టీమ్ సూచించినప్పటికీ ఆటగాళ్లు పట్టించుకోలేదనే వార్తలు వస్తున్నాయి. ఫలితంగా రోహిత్, కోహ్లి వంటి స్టార్ ప్లేయర్లు తమ సొంత మైదానంలో స్పిన్ ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడినట్టు కనిపించారు.
సొంతగడ్డపై తొలిసారి క్లీన్ స్వీప్
స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు తొలిసారి క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. న్యూజిలాండ్ స్పిన్నర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్లు సులువుగా లొంగిపోవడంతో మొత్తం జట్టు కేవలం 121 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత గడ్డపై న్యూజిలాండ్ తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల 6 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 15.50 సగటుతో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 4 పరుగులు మాత్రమే చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. రోహిత్ కూడా సిరీస్ మొత్తం చెత్త ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 15.17 సగటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు.
Team India: వరుస ఓటములతో టీమిండియా కుదేలు.. గంభీర్ అధికారాలకు చెక్ పెట్టనున్న బీసీసీఐ?
Updated Date - Nov 04 , 2024 | 03:42 PM