India vs England: టీమిండియాలో కీలక మార్పు.. జడేజా స్థానంలో ఆ స్టార్ క్రికెటర్?
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:35 PM
టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు.. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం..
టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు (Team India).. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో (England) తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ ఇరుజట్లు పోటీ పడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ తమ తుది జట్టులో ఒక మార్పు చేయాలని భావిస్తోంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను (Ravindra Jadeja) పక్కకు తప్పించి, అతని స్థానంలో ఓ స్టార్ క్రికెటర్‌ని తీసుకోవాలని అనుకుంటోంది. ఇంతకీ ఆ ప్లేయర్ మరెవ్వరో కాదు.. సంజూ శాంసన్ (Sanju Samson).
ఈ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి.. జడేజా తనదైన మార్క్‌ని చూపించలేకపోయాడు. అటు బౌలింగ్‌లో గానీ, ఇటు బ్యాటింగ్‌లో గానీ.. మెరుగైన ప్రదర్శన కనబరచలేదు. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. మూడు ఇన్నింగ్స్‌లలో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే.. సెమీస్‌లో అతనిని తొలగించి, సంజూకి అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ దాదాపు ఫిక్స్ అయినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాగా.. సంజూ ప్రధాన జట్టులో ఉన్నాడు కానీ, ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి.. సెమీస్‌లో తనకు ఛాన్స్ వస్తే ఎలా రాణిస్తాడో చూడాలి.
ఇకపోతే.. ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఎలాగైనా మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అటు.. సూపర్-8లో ఎంతో కష్టపడి సెమీస్‌కి చేరిన ఇంగ్లండ్ జట్టు సైతం టైటిల్ దిశగా దూసుకెళ్లాలని అనుకుంటోంది. దీనికితోడు.. బలాబలాల పరంగా ఇరుజట్లు సమంగా ఉన్నాయి. దీంతో.. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 26 , 2024 | 04:35 PM