Virat Kohli: ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా
ABN, Publish Date - Nov 05 , 2024 | 09:50 AM
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35 సంవత్సరాలు నిండి 36వ ఏడాదిలోకి అడుగుపెట్టడు. 15 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్ ఉన్న కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తోటి క్రికెటర్ల నుంచి మాజీ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేస్తున్నారు.
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35 సంవత్సరాలు నిండి 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్ ఉన్న కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తోటి క్రికెటర్లు మొదలుకొని మాజీ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేస్తున్నారు. బీసీసీఐ కూడా ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
‘‘ 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఇంకా కౌంటింగ్. 27,134 అంతర్జాతీయ పరుగులు, ఇంకా కౌంటింగ్.. 2011 ఐసీసీ వరల్డ్ కప్ విజేత జట్టులో భాగస్వామి, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో ప్లేయర్, 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో ఆటగాడు. టీమిండియా మాజీ కెప్టెన్, అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని బీసీసీఐ గ్రాండ్‌గా బర్త్‌డే విషెస్ తెలిపింది. అద్భుతమైన క్రికెట్ కెరీర్‌తో ఒక దిగ్గజ క్రికెటర్ స్థాయికి ఎదిగిన విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా అతడి కెరీర్ గణాంకాలను ఒకసారి గమనిద్దాం..
ఆధునిక క్రికెట్‌కు విరాట్ కోహ్లీని ఒక బ్రాండ్ అంబాసీడర్‌గా అభివర్ణించవచ్చు. రన్-ఛేజింగ్‌లో మాస్టర్ అయిన విరాట్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 118 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 29 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. 47.83 సగటుతో మొత్తం 9,040 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్కోరు 254 (నాటౌట్) ఉంది. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన నాలుగవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఇక వన్డే కెరియర్ విషయానికి విరాట్ గణాంకాలు ఔరా అనిపిస్తాయి. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన విరాట్ 58.18 సగటుతో 13,906 పరుగులు బాదాడు. ఇందులో 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో విరాట్ బెస్ట్ స్కోరు 183 పరుగులుగా ఉంది. వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా, భారత క్రికెటర్లలో రెండవ ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు విరాట్ కావడం విశేషం. వన్డేల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు, 9,000 పరుగులు, 10,000 పరుగులు, 11,000 పరుగులు, 12,000 పరుగులు, 13,000 పరుగుల మైలురాయిలను అందుకున్న ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. వన్డేల్లో ఛేజ్ మాస్టర్‌గా పేరొందాడు.
ఇక టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే.. విరాట్ ఇప్పటిరవకు 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 117 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 48.69 సగటుతో మొత్తం 4,188 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్‌కు ఒక సెంచరీ, 38 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 122 (నాటౌట్)గా ఉంది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడు. విరాట్ కావడం విశేషం. ఈ ఫార్మాట్‌లో 7 ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక ఫ్రాంచైజీ లీగ్ ఐపీఎల్‌లో కూడా విరాట్‌కు అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
ఇవి కూడా చదవండి
విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా
నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..
ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా
రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
For more Sports News and Telugu News
Updated Date - Nov 05 , 2024 | 10:40 AM