ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pak Vs Ban: బంగ్లాదేశ్‌లో చేతిలో పాక్‌కు అవమానకర ఓటమి.. దుమ్మెత్తిపోస్తున్న పాక్ మాజీలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 06:12 PM

దాయాది దేశం పాకిస్థాన్‌కు దారుణమైన ఓటమి ఎదురైంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ ఇంతదారుణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అవమానకరంగా మారింది.

దాయాది దేశం పాకిస్థాన్‌కు దారుణమైన ఓటమి ఎదురైంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ ఇంతదారుణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అవమానకరంగా మారింది. ఈ ఓటమిపై ఆ దేశ క్రికెట్ మాజీ దిగ్గజాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ ఈ స్థాయికి దిగజారడం, బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.


స్వదేశంలో జరిగిన చివరి 10 టెస్టు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ఇది ఆరవ ఓటమి. ఇక టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌ ఓడించడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిపై పాక్ మాజీ దిగ్గజం జావేద్ మియాందాద్ స్పందిస్తూ.. “పాకిస్థాన్ క్రికెట్ ఈ స్థాయికి దిగజారడం బాధ కలిగిస్తోంది. క్రమశిక్షణతో అద్భుతంగా ఆడిన బంగ్లాదేశ్‌కు ఈ గెలుపు ఘనత దక్కాలి. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగంపై పాకిస్థాన్ జట్టు విఫలమైన తీరు చాలా చెడ్డ సంకేతం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో గొడవల కారణంగా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోయారని మియాందాద్ అభిప్రాయపడ్డారు. తాను కేవలం ఆటగాళ్లను మాత్రమే నిందించబోనని, ఎందుకంటే గత ఒకటిన్నరేళ్లుగా పీబీసీలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. కెప్టెన్సీ, మేనేజ్‌మెంట్ మార్పులు జట్టును ప్రభావితం చేశాయని ఆయన అన్నారు.


కాగా రావల్పిండి వేదికగా జరిగిన రెండవ టెస్టులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక తొలి టెస్టులో బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పటికీ ఆ జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది.


ఇక స్వదేశంలో సైతం ఇంత దారుణంగా ఓడిపోతున్న పరిస్థితిపై మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా స్పందించారు. స్వదేశంలో టెస్ట్ ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా మూడు సిరీస్‌లు ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఇదొక చెత్త రికార్డు అని ఆయన వ్యాఖ్యానించారు. “గతంలో అత్యుత్తమ జట్లను సైతం ఓడించడానికి స్వదేశంలో జరిగే సిరీస్‌లను చక్కటి అవకాశాలుగా పరిగణించేవారు. అయితే ఇలా జరగాలంటే బ్యాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టాలి’’ అని విమర్శించాడు.


ఇక మరో మాజీ దిగ్గజం యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ఒక జట్టు పరాజయాల పరంపరలోకి ప్రవేశించినప్పుడు తిరిగి కోలుకోవడం కష్టమవుతుందని విమర్శించాడు. ‘‘మా బ్యాటర్లు గతంలో పరుగులు సాధించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆటగాళ్లకు మానసికంగా దృఢసంకల్పం అవసరమని నేను భావిస్తున్నాను’’ అని అన్నాడు.

Updated Date - Sep 03 , 2024 | 06:12 PM

Advertising
Advertising