ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: టీమిండియాలో జూనియర్ యువీ.. ఇది వెంటాడి వేటాడే సింహం

ABN, Publish Date - Nov 16 , 2024 | 07:00 PM

Team India: గత కొన్నేళ్లలో టీమిండియా అన్ని విభాగాల్లో మరింత బలంగా మారింది. ప్రతి పొజిషన్‌కు ఒకటికి మించి ఆప్షన్స్ ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ దుర్బేధ్యంగా కనిపిస్తోంది టీమ్. అయితే ఆ ఒక్క పొజిషన్‌ను భర్తీ చేయడం మాత్రం ఎవరి వల్లా కావడం లేదు.

గత కొన్నేళ్లలో టీమిండియా అన్ని విభాగాల్లో మరింత బలంగా మారింది. ప్రతి పొజిషన్‌కు ఒకటికి మించి ఆప్షన్స్ ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ దుర్బేధ్యంగా కనిపిస్తోంది టీమ్. ఇటు బౌలింగ్ నుంచి అటు కీపింగ్ వరకు తోపు ప్లేయర్లు అందుబాటులో ఉండటం, ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇరగదీస్తుండటంతో మెన్ ఇన్ బ్లూకు ఢోకా ఉండటం లేదు. అయితే ఆ ఒక్క పొజిషన్‌ను భర్తీ చేయడం మాత్రం ఎవరి వల్లా కావడం లేదు. మిడిలార్డర్ బ్యాటింగ్ భారత్‌ను చాన్నాళ్లుగా వేధిస్తోంది. దీని వల్ల చాలా మ్యాచుల్ని ఫినిష్ చేయలేక చేతులెత్తయడం చూస్తూనే ఉన్నాం. టాపార్డర్‌ కుప్పకూలితే టీమ్‌ను ఆదుకునే బ్యాటరే కనిపించడం లేదు. ఈ తరుణంలో తాను ఉన్నానంటూ ఓ ప్లేయర్ దూసుకొచ్చాడు. లెజెండ్ యువరాజ్ సింగ్‌కు తానే సరైన వారసుడ్ని అని అంటున్నాడు. బ్యాట్‌ను మాయాదండంలా తిప్పుతూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ సెన్సేషన్ అనేది ఇప్పుడు చూద్దాం..


అతడి గురించే చర్చ

టీమిండియా యువ కెరటం తిలక్ వర్మ చెలరేగిపోతున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస సెంచరీలతో అతడు సృష్టించిన బీభత్సం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. మూడో టీ20లో 56 బంతుల్లో 107 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోక ముందే తర్వాతి మ్యాచ్‌లో మరో సెంచరీ బాదేశాడు. ఈసారి అపోజిషన్ బౌలర్లను మరింతగా ఊచకోత కోశాడు. 255 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన తిలక్.. 47 బంతుల్లో 120 పరుగులు కొట్టాడు. ఇందులో 9 బౌండరీలతో పాటు 10 భారీ సిక్సులు ఉన్నాయి. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు ఉతుకుడే ధ్యేయంగా ఆడుతూ పోయాడు. భారీ షాట్లు బాదడంలో అతడి రేంజ్, బాల్‌ను టైమింగ్ చేస్తున్న విధానాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. దీంతో అతడ్ని అందరూ యువరాజ్‌తో పోలుస్తున్నారు.


ఇద్దరూ ఇద్దరే..

యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ ఆ స్థాయి మిడిలార్డర్ బ్యాటర్ భారత జట్టులోకి రాలేదు. బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో యువీ సమర్థుడు. ఫీల్డింగ్‌లోనూ అతడు తోపే. టాపార్డర్ ఫెయిలైతే తాను ఉన్నానని ఆదుకునేవాడతను. మ్యాచ్‌ను ఫినిష్ చేసేవరకు క్రీజులో నుంచి కదిలేవాడు కాదు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల మెడలు వంచేవాడు. ఇప్పుడు తిలక్ కూడా అదే రీతిలో దయ అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా బౌలర్లను శిక్షిస్తున్నాడు. భారీ షాట్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వరుసగా రెండు సెంచరీలు బాదాడీ హైదరాబాదీ. రెండు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు. అందునా లెఫ్టాండర్ అవడం, స్పిన్ బౌలింగ్ వేసే సత్తా ఉండటం, మంచి ఫీల్డర్ కూడా కావడంతో అతడ్ని జూనియర్ యువీ అంటున్నారు ఫ్యాన్స్. యువరాజ్ మాదిరిగానే బౌలర్లను వెంటాడి వేటాడుతున్నాడని.. అతడ్ని మిడిలార్డర్‌లో ఫిక్స్ చేసేయాలని సూచిస్తున్నారు. బౌలింగ్ ఛాన్స్ కూడా ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

సెంచరీల సంజూకు అంతుపట్టని వీక్‌నెస్.. అది దాటితే రోహిత్ రేంజ్ ఖాయం

గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్.. ఇలా రివర్స్ అయిందేంటి

బాక్సింగ్ దునియాను ఏలినోడు.. యూట్యూబర్ చేతిలో ఓడాడు.. టైసన్ పతనానికి కారణాలు

For More Sports And Telugu News

Updated Date - Nov 16 , 2024 | 07:09 PM