IND vs NZ: పంత్ డకౌట్.. విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్
ABN, Publish Date - Oct 26 , 2024 | 02:24 PM
పంత్ డకౌట్ విషయంలో క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా చీలారు. కొందరు సింగిల్ తీయకపోవడం పంత్ చేసిన తప్పని అంటుంటే..
పూణె: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ డకౌట్ కావడంతో విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శనివారం 3వ రోజు విరాట్ కోహ్లితో మిక్స్-అప్ తర్వాత భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు.
సిరీస్‌ను సమం చేసేందుకు భారత్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 23వ ఓవర్లో అజాజ్ పటేల్ వేసిన బంతిని కోహ్లి బ్యాక్వర్డ్ పాయింట్‌కి కొట్టాడు. కానీ పంత్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. శాంట్నర్ వేగంగా బంతిని ఫీల్డింగ్ చేసి, వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కి సరైన త్రో అందించాడు. పంత్ స్కోరు చేయకుండానే అవుట్ కావడంతో భారత్ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయి 127/4 వద్ద కుప్పకూలింది. పంత్ డకౌట్ విషయంలో క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా చీలారు. కొందరు సింగిల్ తీయకపోవడం పంత్ చేసిన తప్పని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఇది కోహ్లీ తప్పిదంగానే భావించాలని అంటున్నారు.
IND vs NZ: కష్టాల్లో భారత్.. కోహ్లీపైనే ఆశలన్నీ
Updated Date - Oct 26 , 2024 | 03:05 PM