ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tilak Varma: తిలక్ సక్సెస్ వెనుక తెలుగోడు.. వరుస సెంచరీల సీక్రెట్ ఇదే

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:30 PM

Tilak Varma: భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ కోసం కష్టపడుతున్న తిలక్ వర్మ.. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. వరుస సెంచరీలతో తాను లేని టీమ్‌ను ఊహించలేని పరిస్థితి కల్పించాడు. అయితే అతడు తక్కువ టైమ్‌లో ఇంత సక్సెస్ సాధించడానికి ఓ లెజెండే కారణం.

టీమిండియా డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు. ఏడాది కిందే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ.. చాన్నాళ్లు గడుస్తున్నా టీమ్‌లో పర్మినెంట్ బెర్త్‌ను సాధించలేకపోయాడు. టీ20 టీమ్‌లో అడపాదడపా వస్తూ పోతున్నాడు. ఒక సిరీస్‌లో రాణిస్తే, మరో సిరీస్‌లో ఫెయిల్ అవడం.. కన్‌సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేయకపోవడం అతడికి మైనస్‌గా మారింది. భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం కూడా నెగెటివ్ అనే చెప్పాలి. దీంతో మరికొన్ని సిరీస్‌లు చూసి అతడి విషయంలో సెలెక్టర్లు తుది నిర్ణయానికి వస్తారని వినిపించింది. తిలక్ ఇలాగే ఆడితే అతడి స్థానంలో ఇంకో యంగ్‌స్టర్‌ను తీసుకోవడం ఖాయం అని అనుకుంటున్న తరుణంలో ఈ తెలుగు తేజం రెచ్చిపోతున్నాడు. వరుస సెంచరీలతో అందర్నీ షేక్ చేస్తున్నాడు. సౌతాఫ్రికాపై బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్‌తో సిరీస్ రిజల్ట్‌ను డిసైడ్ చేశాడు.


ఆ అదృశ్య శక్తి అతడే..

ప్రొటీస్‌తో టీ20 సిరీస్‌లో చివరి రెండు టీ20ల్లో చెలరేగిపోయాడు తిలక్ వర్మ. మూడో మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలతో పాటు 7 భారీ సిక్సులు ఉన్నాయి. ఆఖరి టీ20లో మరింత విధ్వంసం సృష్టించాడు తిలక్. ఈసారి 47 బంతుల్లో 120 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 10 సిక్సులు బాదాడు. 255 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. భారీ షాట్లు బాదుతూ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. అతడి బ్యాటింగ్ చూసిన వారు మెచ్చుకుంటూనే.. ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు చిన్న స్కోర్లకే పరిమితమయ్యే ప్లేయర్.. అమాంతం ఈ రేంజ్‌లో సక్సెస్ అవడం ఏంటని షాక్ అవుతున్నారు. అయితే అతడి వెనుక ఉన్న సూపర్ పవర్ గురించి తెలిశాక కూల్ అవుతున్నారు. తిలక్ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి మరెవరో కాదు.. దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్.


బాల్ మెరిట్‌ను బట్టే..

టీమిండియా మెయిన్ టీమ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. దీంతో సౌతాఫ్రికా టూర్‌కు పంపిన యంగ్ టీమ్‌కు కోచింగ్ చేసే బాధ్యతను లక్ష్మణ్‌కు అప్పగించింది బీసీసీఐ. దీంతో జట్టుతో పాటు అక్కడికి వెళ్లిన నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌.. సూర్య సేనను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. ముఖ్యంగా తిలక్ వర్మ సక్సెస్‌కు అతడే కారణమని తెలుస్తోంది. తిలక్ బ్యాటింగ్‌ టెక్నిక్‌లోని తప్పులను వీవీఎస్ సరిదిద్దాడట. భారీ షాట్లు బాదడంతో పాటు స్ట్రైక్ రొటేషన్ ఇంపార్టెన్స్ ఏంటో వివరించాడట. అడ్డగోలు షాట్లు కాకుండా బాల్ మెరిట్‌ను బట్టి అటాక్ చేయడం ముఖ్యమని సూచించాడట. అలాగే తక్కువ స్కోర్లను భారీ ఇన్నింగ్స్‌గా ఎలా మలచాలో నేర్పించాడట. అందుకే తిలక్ వరుస సెంచరీలు బాదడమే గాక రెండు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలిచాడని, మ్యాచ్‌లు ముగించాడని సమాచారం.


Also Read:

పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ

ఆసీస్ కోసం రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్

స్పెన్సర్‌ ‘పాంచ్‌’

For More Sports And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 01:33 PM