ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: కివీస్‌తో రెండు, మూడవ టెస్టులకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:59 PM

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తదుపరి రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.

Team India

ముంబై: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తదుపరి రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ (BCCI) ఆదివారం ప్రకటించింది. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కొత్తగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరుని బీసీసీఐ జత చేసింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు పుణేలో ఉన్న భారత్ జట్టుతో వాషింగ్టన్ సుందర్ కలుస్తాడని తెలిపింది.

‘‘న్యూజిలాండ్‌తో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ టెస్ట్ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో చేర్చుతూ సెలక్షన్ కమిటీ ఆదివారం నిర్ణయించింది. రెండవ టెస్టు మ్యాచ్‌కు ముందు పూణేలో ఉన్న జట్టుతో అతడు కలుస్తాడు’’ అని బీసీసీఐ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.


జట్టు ఇదే..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.


రంజీ ట్రోఫీలో సత్తా.. సుందర్‌కు పిలుపు..

స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌లో తమిళనాడు తరఫున ఆడి 152 పరుగుల భారీ స్కోర్ బాదాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 269 బంతులు ఎదుర్కొని 152 రన్స్ రాబట్టాడు. అతడి కీలక ఇన్నింగ్స్ సాయంతో ఢిల్లీపై మ్యాచ్‌లో తమిళనాడు ఏకంగా 600లకు పైగా భారీ స్కోరును నమోదు చేయగలిగింది. సుందర్ ఆటతీరుని గమనించిన సెలక్టర్లు న్యూజిలాండ్‌తో రెండవ, మూడవ టెస్టులకు ఎంపిక చేశారు.

కాగా వాషింగ్టన్ సుందర్ భారత జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడక చాలా కాలమైంది. 2021లో ఇంగ్లండ్‌తో 4 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిసారిగా భారత్‌ జట్టుకు ఆడాడు. ఇక అదే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్ట్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. మొత్తంమీద ఇప్పటివరకు నాలుగు టెస్టులు మాత్రమే సుందర్ ఆడాడు. 6 వికెట్లు తీయడమే కాకుండా 265 పరుగులు రాబట్టాడు.


ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌లకు వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ కోసం జట్టు నుంచి సుందర్ విడుదలయ్యాడు.


ఇవి కూడా చదవండి

టీమిండియాకు గుడ్‌న్యూస్.. గాయపడిన ఆటగాడు వచ్చేస్తున్నాడు

కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా

For more Sports News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 09:03 PM