ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

W Sundar: సంచలన బౌలింగ్‌తో రికార్డు సృష్టించిన వాషింగ్టన్ సుందర్

ABN, Publish Date - Oct 24 , 2024 | 07:58 PM

పుణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజున భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మ్యాజికల్ స్పెల్‌ వేసి పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు.

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజున భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మ్యాజికల్ స్పెల్‌ వేసి పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించాడు. దీంతో 259 పరుగులకే కివీస్ ఆలౌట్ అయింది. కాగా ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు తీసిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (WTC) చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో సుందర్ న్యూజిలాండ్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అవతరించాడు. డబ్ల్యూటీసీ 2019లో ప్రారంభమవగా కివీస్‌పై 7 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ సుందర్ కావడం విశేషం.


డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే..

1, వాషింగ్టన్ సుందర్ - 7/59, 2024

2. ప్రబాత్ జయసూర్య - 6/42, 2024

3. ఎబాడోట్ హుస్సేన్ - 6/46 , 2022

4. నాథన్ లియోన్ - 6/65, 2024

5. తైజుల్ ఇస్లాం - 6/76, 2023.

అంతేకాదు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలను సుందర్ నమోదు చేశాడు. ఫిబ్రవరి 2017లో ఈ స్టేడియంలో భారత్‌పై ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ రికార్డును ఇప్పుడు చెరిపివేశాడు.


కాగా పుణే టెస్టులో మొత్తం 23.1 ఓవర్లు వేసిన సుందర్ 59 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. సరైన ప్రదేశంలో నిలకడగా బంతులు సంధించడంపై దృష్టి పెట్టానని ఆట తొలి రోజు ముగిసిన అనంతరం సుందర్ చెప్పాడు. ఈ పిచ్ మొదటి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని తమకు తెలుసునని పేర్కొన్నాడు. రచిన్ రవీంద్ర వికెట్ తీయడం తనకు నచ్చిందని, ఎందుకంటే అతడు బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. ఇక డారిల్ మిచెల్ వికెట్ తీయడం కూడా బాగుందని అన్నాడు.


కాగా బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. జట్టులోకి అతడిని తీసుకుంటున్నట్టు ఆదివారమే బీసీసీఐ ప్రకటించింది. ఇవాళ కుల్దీప్ యాదవ్ స్థానంలో తుది జట్టులోకి కూడా తీసుకున్నారు. దీంతో తన అంతర్జాతీయ కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ గణాంకాలను సుందర్ నమోదు చేశాడు. కాగా పుణే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

Updated Date - Oct 24 , 2024 | 08:46 PM