ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KL Rahul: అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు రాహుల్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణమిదేనా..?

ABN, Publish Date - Jan 08 , 2024 | 10:45 AM

అఫ్ఘానిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 16 మందితో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం గమనార్హం. ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నాడు.

అఫ్ఘానిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 16 మందితో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం గమనార్హం. ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నాడు. దీంతో ఏడాది కాలం తర్వాత రోహిత్, కోహ్లీ మళ్లీ టీ20 మ్యాచ్‌లు ఆడనున్నారు. వీరిద్దరు చివరగా 2022 నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడారు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనుండడంతో వారు టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. అయితే ఈ జట్టులో అనూహ్యంగా మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. ఇటీవల కాలంలో భారత జట్టులో టెస్టులు, వన్డేల్లో రాహుల్ కీలక ఆటగాడిగా మారాడు. మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడి ఆదుకుంటున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తోన్న అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌లో రాహుల్‌కు చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం రాహుల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుతం ఇందుకు గల కారణాలేంటనేది ఆసక్తికరంగా మారింది.


పలువురు విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. కేఎల్ రాహుల్ తన టీ20 కెరీర్ మొత్తంలో దాదాపుగా ఓపెనింగ్‌లోనే ఆడాడు. ఐపీఎల్‌లో కూడా రాహుల్ ఎక్కువగా ఓపెనింగ్, టాపార్డర్‌లోనే బ్యాటింగ్ చేశాడు. మిడిలార్డర్‌లో ఎప్పుడూ ఆడలేదు. ఇదే రాహుల్‌కు మైనస్ అయింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో ఓపెనింగ్‌లో తీవ్ర పోటీ ఉంది. అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. తుది జట్టులో గిల్, జైస్వాల్‌లో ఒక్కరికే చోటు దక్కనుంది. దీంతో రాహుల్‌ను ఓపెనింగ్‌లో ఎంపిక చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనింగ్ రేసులోనే ఉన్నారు. ఇక వికెట్ కీపర్‌గా చూసుకున్న సంజూ శాంసన్, జితేష్ శర్మ జట్టులో ఉన్నారు. వీరిద్దరు కాకుండా జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ కూడా ఉంటాడు. వీరికి మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం చాలానే ఉంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతోపాటు కీపింగ్‌కు కూడా పనికొస్తారనే ఉద్దేశ్యంతో సెలెక్టర్లు శాంసన్, జితేష్ వైపే మొగ్గుచూపారు. దీంతో రాహుల్‌కు ఈ సిరీస్‌లో అవకాశం దక్కలేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్‌కు టీ20 ప్రపంచకప్‌లో కూడా చోటు దక్కకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. అయితే ప్రపంచకప్‌నకు ముందు జరిగే ఐపీఎల్‌లో రాహుల్ సత్తా చాటితే సెలెక్టర్లు అతని వైపు చూసే అవకాశాలున్నాయి. ఈ సీజన్ అంతా రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కేంచుకునేందుకు అతనికి మెరుగైన అవకాశాలుంటాయని చెబుతున్నారు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో 72 టీ20లు ఆడిన రాహుల్ 37 సగటుతో 2,265 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి.

అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు

రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, జైస్వాల్‌, కోహ్లీ, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌.

Updated Date - Jan 08 , 2024 | 10:48 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising