RCB vs CSK: ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు
ABN, Publish Date - May 19 , 2024 | 07:59 AM
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసి..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసి, కనీవినీ ఎరుగని రీతిలో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆర్సీబీ ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడం వల్లే ఈ చారిత్రాత్మక విజయాన్ని ఆర్సీబీ సాధించగలిగింది. మరీ ముఖ్యంగా.. చివరి ఓవర్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, బౌలర్ యశ్ దయాల్ హీరోగా నిలిచాడు. అవతల బెస్ట్ ఫినిషర్స్ ఉన్నప్పటికీ.. 17 పరుగుల్ని డిఫెండ్ చేసి, జట్టు విజయంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు.
నిజానికి.. క్రీజులో ధోనీతో పాటు మంచి ఫామ్‌లో ఉన్న జడేజాని చూసి, చివరి ఓవర్‌లో 17 పరుగులు సునాయాసంగా కొట్టేస్తారని మొదట్లో అందరూ అనుకున్నారు. అదే టైంలో తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టడంతో.. ఇక చెన్నై ప్లేఆఫ్స్ చేరడాన్ని ఎవ్వరూ ఆపలేరని అంతా భావించారు. కానీ.. రెండో బంతికే యశ్ దయాల్ ఆ సమీకరణాల్ని మార్చేశాడు. ధోనీకి ఓ టెంప్టింగ్ బాల్ వేసి.. అతడిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాతి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చిన యశ్ దయాల్.. చివరి రెండు బంతుల్ని కూడా డాట్ బాల్స్‌గా మలిచాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. జడేజా బ్యాట్‌కు బంతి ఏమాత్రం తగలకుండా డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఆర్సీబీ అఖండ విజయం సాధించి, ప్లేఆఫ్స్‌లోకి వెళ్లిపోయింది.
గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కు వేసిన చివరి ఓవర్‌లో 29 పరుగులు సమర్పించి అప్రతిష్టపాలైన యశ్ దయాల్.. ఈ సీజన్‌లో మాత్రం చివరి ఓవర్‌లో 17 పరుగుల్ని డిఫెండ్ చేసి, ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు పంపించి, ఆ జట్టుకి హీరోగా అవతరించాడు. సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని తన ప్రతిభతో యశ్ దయాల్ చాటిచెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ సైతం అతను చివరి ఓవర్ వేసిన తీరు చూసి.. తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ని అతనికి అంకితం చేశాడు. అటు.. క్రీడాభిమానులు సైతం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎవరైతే గతేడాదిలో తనని విమర్శించారో, ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకుంటున్నాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 19 , 2024 | 07:59 AM