Dinesh Karthik: చిన్నస్వామిలో కార్తీక్ తుఫాన్.. అతను వెళ్తున్నపుడు ప్రేక్షకులు ఎలా గౌరవించారో చూడండి..!
ABN, Publish Date - Apr 16 , 2024 | 01:05 PM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెటరన్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తుఫాన్ సృష్టించాడు. తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలవోకగా ఎదుర్కుంటూ వారికి చుక్కలు చూపించాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెటరన్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) తుఫాన్ సృష్టించాడు. తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలవోకగా ఎదుర్కుంటూ వారికి చుక్కలు చూపించాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. కార్తీక్ క్రీజులో ఉన్నంత సేపు హైదరాబాద్ బౌలర్లకు ఎక్కడ బంతులు వేయాలో అర్థం కాలేదు (IPL 2024).
సోమవారం బెంగళూరులో సన్‌రైజర్స హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (SRH vs RCB). 288 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కార్తీక్ ఆసమాన పోరాట పటిమ ప్రదర్శించాడు. మైదానం నలువైపులా తనకే సాధ్యమైన షాట్లు కొట్టాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అయినా బెంగళూరు చేరుకోవాల్సిన లక్ష్యం కొండంత ఉండడంతో కార్తీక్ ఒక్కడి పోరాటం సరిపోలేదు. కార్తీక్ అవుటై వెళ్తున్నపుడు అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ``దినేష్ కార్తీక్ నిజమైన తలా`` అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ఈ మ్యాచ్‌లోనే కాదు.. ఈ సీజన్‌లో ఇంతకు ముందు మంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తీక్ సత్తా చాటాడు. తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వచ్చి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కార్తీక్ పరుగులు చేస్తున్నాడు. కార్తీక్ బ్యాటింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తీక్‌ను కచ్చితంగా టీ-20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Watch Video: క్లాసెన్ కొడితే అలాగే ఉంటుంది.. స్టేడియం అవతల పడిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూడండి..!
IPL 2024: సెంచరీ చేసినా.. బ్యాట్ పైకి లేపలేదు.. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసలు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 16 , 2024 | 01:05 PM