ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: మన మీడియాకు ఆ అలవాటు ఉంది.. జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 04 , 2024 | 11:21 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు చేశాడు. దీంతో అద్భుత డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్‌పై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు జైస్వాల్‌ను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ఈ నేపథ్యంలో గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్‌పై ఎక్కువ హైప్ క్రియేట్ చేయడాన్ని వ్యతిరేకించాడు. యువ ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడనివ్వాలని, వారిపై అంచనాలు పెంచేసి ఒత్తిడికి గురి చేయొద్దని చెప్పాడు. వారి పట్ల ఓపికగా వ్యవహరించాలని కోరాడు.


గంభీర్ మాట్లాడుతూ.. ‘‘డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్‌ను నేను అభినందిస్తున్నాను. ఆ యువకుడు తన ఆటను తాను ఆడుకోనివ్వండని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో మనకు, ముఖ్యంగా మీడియాకు అతిగా హైప్ చేసే అలవాటు ఉంది. ఇది మనం గతంలోనే చూశాం. ఆటగాళ్లు విజయాలు సాధించినప్పుడు, దానిని ఎక్కువ చేసి చూపించడంతోపాటు వారికి ఏదో ఒక ట్యాగ్‌లు ఇచ్చి హీరోలుగా చూపిస్తారు. దీంతో వారిపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆటగాళ్లు తమ సహజమైన ఆటను ఆడలేకపోతారు. కాబట్టి జైస్వాల్‌ను ఎక్కువ హైప్ చేసి హీరోను చేయకండి. అతన్ని ఎదగనివ్వండి. క్రికెట్‌ను అస్వాదించనివ్వండి’’ అని చెప్పాడు. అలాగే ఇటీవల కాలంలో అంతగా రాణించలేకపోతున్న శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ గురించి గంభీర్ మాట్లాడాడు. వారిద్దరు నాణ్యమైన బ్యాటర్లు అని పేర్కొన్న గౌతీ.. వారికి తగిన సమయం ఇవ్వాలని కోరాడు. గతంలోనూ వారు ఇలాంటి వాటి నుంచి బయటపడ్డారని, అందుకే ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్నారని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 11:21 AM

Advertising
Advertising