ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhoni: ధోనీని కలిసేందుకు సైకిల్‌పై 1200 కి.మీ. ప్రయాణం.. ఫామ్‌హౌస్ బయట పడిగాపులు.. చివరకు..

ABN, Publish Date - Oct 04 , 2024 | 11:58 AM

ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీని పిచ్చిగా అభిమానిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ధోనీ కోసం చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

A fan cycled 1200 km to meet Dhoni

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అతడిపై అభిమానం రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీని పిచ్చిగా అభిమానిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధోనీకి వీరాభిమానులు (Dhoni Fans) ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ధోనీ కోసం చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ (Delhi)కి చెందిన ఆ ఫ్యాన్ ధోనీపై తన అభిమానాన్ని చాలా ఘనంగా చాటుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ధోనీని కలిసేందుకు గౌరవ్‌ కుమార్‌ అనే అభిమాని ఢిల్లీ నుంచి రాంఛీ (Ranchi) వరకు సైకిల్ (Bicycle) యాత్ర చేశాడు. సుమారు 1200 కిలోమీటర్ల మేర సైకిల్‌ పైనే ప్రయాణించాడు. ధోనీని కలుసుకునేందుకు అతడి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాడు. వారం రోజుల పాటు ఆ ఫామ్‌హౌస్ ముందే చిన్న టెంట్‌ వేసుకుని నిరీక్షించాడు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. ధోనీ ఆ అభిమానిని కలిశాడు. అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అయితే ఫొటోలు, వీడియోలు మాత్రం తీసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ మాత్రం దానికే ఆ అభిమాని సంతోషంతో పొంగిపోయాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషపడిపోతున్నాడు. తన ఆనందాన్ని వర్ణిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


``ఎట్టకేలకు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ధోనీ సర్‌ను కలిసేందుకు నాకు ఓ అవకాశం వచ్చింది. ఆయన తన ఫామ్‌హౌస్ మొత్తాన్ని దగ్గరుండి మరీ నాకు చూపించారు. భద్రతా కారణాల వల్ల ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం దక్కలేదు. నాకు ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. నాకు అదే చాలా పెద్ద విషయం`` అంటూ గౌరవ్ పేర్కొన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 30 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై ధోనీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

PCB: పాకిస్థాన్ క్రికెటర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్..


Rashid Khan: వైభవంగా ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. నెట్టింట వీడియోలు వైరల్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 11:58 AM