కొడుకు తొలి శతకం తండ్రి భావోద్వేగం అమ్మతో..
ABN, Publish Date - Dec 29 , 2024 | 05:37 AM
నితీశ్ మొదటి టెస్టు శతకం పూరించగానే..స్టేడియంలో ఉన్న అతడి తండ్రి ముత్యాలరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నితీశ్ 90ల్లోకి రాగానే ఆయన ముఖంలో టెన్షన్ కనిపించింది. కుమారుడు శతకం చేయాలని...
నితీశ్ మొదటి టెస్టు శతకం పూరించగానే..స్టేడియంలో ఉన్న అతడి తండ్రి ముత్యాలరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నితీశ్ 90ల్లోకి రాగానే ఆయన ముఖంలో టెన్షన్ కనిపించింది. కుమారుడు శతకం చేయాలని ఆయన దేవుణ్ణి ప్రార్థించారు. సెంచరీ పూర్తి చేయగానే ఉద్వేగం పట్టలేక ఏడ్చేశారు. తండ్రితోపాటు గ్రౌండ్‌లో మ్యాచ్ తిలకిస్తున్న నితీశ్ తల్లి, సోదరి కూడా ఉద్వేగానికి లోనయ్యారు. శనివారం సాయంత్రం నితీశ్‌ను అతడు బస చేస్తున్న హోటల్లో తల్లి, తండ్రి, సోదరి కలిశారు. డోర్ తీసిన వెంటనే తల్లిని హత్తుకున్న నితీశ్..అనంతరం సోదరిని, చివరగా తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తండ్రిని చూసి నితీశ్ ఉద్వేగానికి గురయ్యాడు.
Updated Date - Dec 29 , 2024 | 05:37 AM