బోణీ అదిరె..
ABN, Publish Date - Dec 23 , 2024 | 05:05 AM
టీ20 ఫార్మాట్ జోరును భారత మహిళల జట్టు వన్డే సిరీ్‌సలోనూ కొనసాగిస్తోంది. ఆదివారం వెస్టిండీ్‌సతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. స్మృతి మంధాన (91) తన భీకర ఫామ్‌ను...
211 రన్స్ తేడాతో హర్మన్ సేన ఘనవిజయం
స్మృతి చేజారిన శతకం
విండీ్‌సతో తొలి వన్డే
వడోదర: టీ20 ఫార్మాట్ జోరును భారత మహిళల జట్టు వన్డే సిరీ్‌సలోనూ కొనసాగిస్తోంది. ఆదివారం వెస్టిండీ్‌సతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. స్మృతి మంధాన (91) తన భీకర ఫామ్‌ను కొనసాగించగా.. బౌలింగ్‌లో పేసర్ రేణుక (5/29) హడలెత్తించిం ది. దీంతో భారత్ ఏకంగా 211 పరుగుల తేడాతో ఘనంగా బోణీ చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం అందుకుంది. మంగళవారం ఇదే స్టేడియంలో రెండో డే/నైట్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్లీన్ (44), రావల్ (40), హర్మన్ (34), జెమీమా (31) రాణించారు. ిజైదా జేమ్స్‌కు ఐదు వికెట్లు దక్కాయి.
పేసర్ రేణుకా ధాటికి ఓ దశలో 34/6 స్కోరుతో దీనస్థితిలో నిలిచింది. టాప్-4 బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే ఫ్లెచర్ (24 నాటౌట్) కాస్త రాణించడంతో చివరికి బంగ్లా 26.2 ఓవర్లలో 103రన్స్‌చేసి చిత్తుగా ఓడింది. ప్రియాకు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా రేణుకా సింగ్ నిలిచింది.
బ్యాటర్ల దూకుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు ఆరంభం నుంచే విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. మంధాన విండీస్‌పై ఇప్పటికే టీ20 సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు సాధించింది. అదే ఫామ్‌ను తొలి వన్డేలోనూ ప్రదర్శించి త్రుటిలో శతకం చేజార్చుకుంది. 13 ఫోర్లతో తన ఆధిపత్యాన్ని చూపింది. అలాగే అరంగేట్ర ఓపెనర్ ప్రతికా రావల్ కూడా ఆకట్టుకోవడంతో తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 24వ ఓవర్‌లో ఈ జోడీని మాథ్యూస్ విడదీసింది. ఆ తర్వాత హర్లీన్‌తో కలిసి మంధాన రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించడం విశేషం. అయితే సెంచరీ ఖాయంగా కనిపించిన మంధానాను జేమ్స్ ఎల్బీ చేసింది. మిడిలార్డర్‌లో హర్మన్, రిచా (26), జెమీమా వేగంగా ఆడి పరుగులు రాబట్టారు. అయితే చివర్లో స్పిన్నర్ జేమ్స్ తన వరుస రెండు ఓవర్లలో భారత్ ఆఖరి 4 వికెట్లను తీసి కాస్త కట్టడి చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 314/9 (స్మృతి మంధాన 91, హర్లీన్ 44, ప్రతికా రావల్ 40, హర్మన్ 34, జెమీమా 31; జేమ్స్ 5/45, మాథ్యూస్ 2/61).
వెస్టిండీస్: 26.2 ఓవర్లలో 103 ఆలౌట్. (ఫ్లెచర్ 24 నాటౌట్, క్యాంప్‌బెల్ 21; రేణుకా సింగ్ 5/29, ప్రియా మిశ్రా 2/22).
Updated Date - Dec 23 , 2024 | 05:06 AM