ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hardik Pandya: హార్దిక్ అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.. ధోనీని ఫాలో అవుదామనుకుంటున్నాడు: ఏబీ డివిల్లీర్స్

ABN, Publish Date - May 10 , 2024 | 03:48 PM

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ విమర్శించాడు. ధోనీని అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్‌కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు.

Hardik Pandya

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై (MI) జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ (AB de Villiers) విమర్శించాడు. ధోనీని (MS Dhoni) అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్‌కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు. అలాగే ముంబై టీమ్‌లో లుకలుకలు మొదలయ్యాయని వస్తున్న వార్తలపై కూడా డివిల్లీర్స్ ఆందోళన వ్యక్తం చేశాడు (IPL 2024).


``ముంబై టీమ్ నాకౌట్ దశకు చేరుకుంటుందని నేను బలంగా నమ్మాను. ఆ జట్టుకు ఆ సత్తా ఉంది. కానీ, ఎక్కడో లోపం ఉంది. ఈ సీజన్‌లో వారు పూర్తిగా నిరాశపరిచారు. హార్దిక్ నాయకత్వమే దీనంతటికీ కారణం అనుకుంటున్నా. మైదానంలో హార్దిక్ ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, అతడిది అహంకారపూరిత శైలి. ధోనీలా శాసించాలనుకుంటున్నాడు. కుర్రాళ్లతో నిండిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు అలాగే కెప్టెన్సీ చేయాలి. కానీ, సీనియర్ ప్లేయర్లతో నిండిన ముంబైకి ఆ వ్యూహం పనికి రాద``ని డివిల్లీర్స్ అన్నాడు.


ముంబై టీమ్‌లో హార్దిక కారణంగా అసంతృప్తికి గురవుతున్నట్టు కొందరు ఆటగాళ్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం తిలక్ వర్మపై హార్దిక్ చేసిన కామెంట్లు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఆ మ్యాచ్‌లో టాప్ స్కోరర్ అయిన తిలక్ వర్మనే ఓటమికి కారణం అనేలా పాండ్యా వ్యాఖ్యానించాడు. తిలక్ మరింత దూకుడుగా ఆడాల్సిందని, మ్యాచ్ గురించి అవగాహన లేకపోవడం వల్లే అలా జరిగిందని పాండ్యా అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?


Hardik Pandya: ముంబై జట్టులో ముదిరిన ‘పాండ్యా’ వివాదం.. తిలక్ వర్మతోనే మొదలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 10 , 2024 | 03:48 PM

Advertising
Advertising