ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!

ABN, Publish Date - Jul 22 , 2024 | 11:36 AM

శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న వేళ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ తన ప్రణాళిక ఏంటో వివరించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు.

Gautam Gambhir

శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న వేళ టీమిండియా హెడ్ కోచ్‌ (Head Coach)గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ తన ప్రణాళిక ఏంటో వివరించాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, ఫిట్‌నెస్ కాపాడుకుంటే 2027లో జరిగే ప్రపంచకప్‌లో కూడా వారిద్దరూ ఆడతారని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, తన కోచింగ్ గురించి గంభీర్ మాట్లాడాడు.


``సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోం. ఇక్కడ గంభీర్ ముఖ్యం కాదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టుకు మార్గనిర్దేశనం చేయబోతున్నా. నేనేం చేయాలో నాకు తెలుసు. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. చాలా సంతోషమైన, ఆహ్లాదకరమైన డ్రెస్సింగ్ రూమ్‌ను కలిగిన జట్టు గొప్ప విజయాలు సాధించగలదు. నేను ఏ విషయాన్నీ సంక్లిష్టం చేయను. జట్టులోని ప్రతి ఒక్కరికీ నా మద్దతు ఉంటుంద``ని గంభీర్ స్పష్టం చేశాడు.


టీమిండియా సహాయక సిబ్బంది పూర్తిగా ఫైనలైజ్ కాలేదని, ప్లేయర్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ముందుకెళ్తానని గంభీర్ స్పష్టం చేశాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం, వారిపై నమ్మకం ఉంచి ప్రోత్సహించడమే కోచ్‌గా తన విధి అని స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి..

Hardik Pandya: అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదు.. వివరణ ఇచ్చిన అజిత్ అగార్కర్!


Ruturaj Gaikwad: బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉంటేనే టీమిండియాలో చోటు.. సీఎస్కే మాజీ ఆటగాడి ఘాటు విమర్శలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 11:36 AM

Advertising
Advertising
<