ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs NZ: టీమిండియా దూకుడుకు వరుణుడి కళ్లెం

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:59 AM

ఎలాగైనా న్యూజిలాండ్ ఆధిపత్యానికి అడ్డుకట్టవేసేందుకు దూకుడుగా ఆడుతున్న టీమిండియాకు చుక్కెదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతుండగా వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. ప్రస్తుతం టీమిండియా 344/3 స్కోర్ వద్ద నిలిచింది.

teamindia

బెంగళూరు: టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ కు అంతరాయం ఏర్పడింది. నాలుగో రోజు ఆట కొనసాగుతుండగా వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. ప్రస్తుతం టీమిండియా 344/3 స్కోర్ వద్ద నిలిచింది. ఇంకా 12 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా న్యూజిలాండ్ ఆధిపత్యానికి అడ్డుకట్టవేసేందుకు దూకుడుగా ఆడుతున్న టీమిండియాకు చుక్కెదురైంది. ఇప్పటికే మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ తొలి సెంచరీ మార్కును అందుకోగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధ సెంచరీని పూర్తిచేశాడు. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న సమయంలో వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇప్పటికే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి చెత్త రికార్డును నెలకొల్పింది. న్యూజిలాండ్ మాత్రం 402 పరుగులతో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.


తొలి ఇన్నింగ్స్ నిరాశే..

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ లో రాణించలేకపోయిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాస్త ఊరటనిచ్చింది. అయితే, ఊహించని రీతిలో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపైనా రోహిత్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.


భారత్ చేజింగ్ కు బ్రేక్..

మొదటి సెషన్ ఆట తర్వాత జట్లు ముందుగానే లంచ్ పూర్తిచేశారు. ఆకస్మిక వర్షం కారణంగా న్యూజిలాండ్ ఆధిక్యాన్ని తగ్గించేంచేందుకు బరిలోకి దిగిన భారత్ తన చేజింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ 4వ రోజున కేవలం 20 ఓవర్లలో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసారు. సర్ఫరాజ్ తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. హై-రిస్క్ షాట్‌లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు, పంత్ 55 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

Updated Date - Oct 19 , 2024 | 12:02 PM