సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:41 AM
డోప్ టెస్ట్‌కు తన వివరాలు తెలియజేయని స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నియంత్రణ (నాడా) సంస్థ క్రమశిక్షణ కమిటీ 16 నెలల సస్పెన్షన్ విధించింది...
స్ప్రింటర్ హిమాదా్‌సపై వివాదం
న్యూఢిల్లీ: డోప్ టెస్ట్‌కు తన వివరాలు తెలియజేయని స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నియంత్రణ (నాడా) సంస్థ క్రమశిక్షణ కమిటీ 16 నెలల సస్పెన్షన్ విధించింది. అయితే సస్పెన్షన్ సమయంలో ఆమె పోటీలలో పాల్గొనడం దుమారం రేపుతోంది. హిమపై విధించిన సస్పెన్షన్ జూలై 23, 2023 నుంచి అమలులోకి వచ్చింది. 16 నెలల శిక్ష గత నెల 21 తేదీతో పూర్తయింది. అంటే ఆ మరుసటి రోజునుంచే టోర్నీలలో పాల్గొనేందుకు దాస్ అర్హురాలు. కానీ ఆమె గత ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రీతోపాటు జూన్‌లో పంచకులలో జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర టోర్నీలలో పాల్గొనడం గమనార్హం. ఈనేపథ్యంలో నాడా సస్పెన్షన్‌కు విలువేమిటనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రస్తుతం తిరువనంతపురంలో శిక్షణలో పాల్గొంటున్న హిమాదా్‌సను వివరణ కోరితే స్పందించేందుకు ఆమె నిరాకరించింది.
Updated Date - Dec 26 , 2024 | 05:41 AM