ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!

ABN, Publish Date - Jun 01 , 2024 | 05:45 PM

అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Dinesh Karthik

అత్యధిక ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తిక్ (Dinesh Karthik) ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు (Dinesh Karthik Retirement). ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై కామెంటేటర్‌గానే ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన కామెంటేటర్ల ప్యానెల్ జాబితాలో దినేష్ కార్తిక్ పేరు కూడా ఉంది.


తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా దినేష్ కార్తిక్ వెల్లడించాడు. ``నేనెప్పుడు బరిలోకి దిగినా వంద శాతం నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తా. ఫిట్‌నెస్ పరంగా మరో మూడేళ్లు క్రికెట్ ఆడగలను. గత మూడు దశాబ్దాల కాలంలో ఫిట్‌నెస్ కారణంగా నేను మ్యాచ్‌లకు దూరమైంది లేదు. కానీ, మానసికంగా మాత్రం ఫిట్‌‌గా లేని సందర్భాలు ఉన్నాయి. మానసికంగా ఫిట్‌గా లేకపోతే మైదానంలోకి దిగకూడదు. బయటి వారికి ఇవేవీ తెలియకపోవచ్చు. కానీ, ఓ క్రికెటర్‌కు అర్థమవుతుంద``ని కార్తిక్ అన్నాడు.


``ఇక, భవిష్యత్తులో భారత జట్టుకే ఆడే అవకాశాలు నాకు రావడం అసాధ్యం. ఐపీఎల్ మాత్రమే ఆడాలి. మానసికంగా ఫిట్‌గా లేనప్పుడు జట్టుకు భారం కావడం తప్ప ఉపయోగం ఉండదు. బాగా ఆడలేకపోతున్నా జట్టులో ఉన్నామనే గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంటుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే నేను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. ఇదే సరైన సమయం అని భావించా`` అంటూ దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం


Baseball : బేస్‌బాల్‌ దేశంలో.. క్రికెట్‌కు దారి దొరికేనా?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2024 | 05:45 PM

Advertising
Advertising