ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: రూ.18.5 కోట్లు వృథా.. అతడికి తుది జట్టులో ఉండే అర్హత కూడా లేదు.. సెహ్వాగ్ ఫైర్!

ABN, Publish Date - Apr 22 , 2024 | 03:56 PM

పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ప్రదర్శనపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటు బౌలర్‌గనూ, ఇటు బ్యాటర్‌గానూ రాణించడం లేదని, అతడికి తుది జట్టులో ఉండే అర్హతే లేదని సెహ్వాగ్ మండిపడ్డాడు.

Sam Curran, Virender Sehwag

పంజాబ్ కింగ్స్ లెవెన్ (PBKS ) ఆల్ రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) ప్రదర్శనపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటు బౌలర్‌గనూ, ఇటు బ్యాటర్‌గానూ రాణించడం లేదని, అతడికి తుది జట్టులో ఉండే అర్హతే లేదని సెహ్వాగ్ మండిపడ్డాడు. సామ్ కర్రన్‌ను పంజాబ్ ఫ్రాంఛైజీ 18.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్‌గా సేవలందిస్తాడని ఆశ పడింది. అయితే సామ్ కర్రన్ మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నాడు (IPL 2024).


గాయం కారణంగా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరం కావడంతో రెండు మ్యాచ్‌లకు సామ్ కర్రన్ నాయకత్వం వహించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఓటమి పాలైంది. అటు అటగాడిగా, ఇటు కెప్టెన్‌గా సామ్ కర్రన్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ``సామ్ కర్రన్‌ను నేను ఆల్ రౌండర్‌గా పరిగణించను. అలాంటి ఆటగాడు జట్టులో ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగమూ ఉండదు. బ్యాటింగ్‌తోనైనా, బౌలింగ్‌తో నైనా మ్యాచ్‌ను గెలిపిస్తేనే ఉపయోగం`` అంటూ సెహ్వాగ్ మాట్లాడాడు.


కాగా, ఈ ఐపీఎల్‌లో సామ్ కర్రన్ ఇప్పటివరకు 11 వికెట్లు తీసి, 152 పరుగులు మాత్రమే చేశాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కర్రన్ 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 18 పరుగులచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2024: వాళ్లకు పార్టీలు ఎక్కువ.. టైటిల్ గెలవని ఫ్రాంఛైజీలపై సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు!


FIDE Title: 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన గుకేశ్..ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2024 | 03:56 PM

Advertising
Advertising