ICC: మారిన ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ వేదిక
ABN, Publish Date - Aug 20 , 2024 | 09:56 PM
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో టోర్నమెంట్ నిర్వహణకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో మంచి అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. వేదిక కోసం శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు మొగ్గు చూపించింది. యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది.

రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టడంతో వందలాది మంది చనిపోయారు. ప్రధాని పదవి రాజీనామా చేసి, భారత్ ఆశ్రయం పొందారు షేక్ హసీనా. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఆ క్రమంలో ఇతర దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దాంతో వరల్డ్ కప్ టోర్ని వేదిక మార్చాల్సి వచ్చింది.
‘బంగ్లాదేశ్‌లో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించకపోవడం చాలా బాధ కలిగించింది. అనుకొని పరిస్థితుల వల్ల తప్పడం లేదు. చిరస్మరణీయ టోర్నీ నిర్వహించే అవకాశం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోల్పోయింది. అనుకొని పరిస్థితుల వల్ల చివరి క్షణంలో వేదిక మార్చాల్సి వచ్చింది అని’ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Aug 20 , 2024 | 09:56 PM