ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mohammad Nabi: 1,739 రోజుల రికార్డు బ్రేక్ చేసిన ఆల్ రౌండర్‌..జాబితాలో టాప్

ABN, Publish Date - Feb 14 , 2024 | 08:33 PM

మహ్మద్ నబీ ప్రపంచ నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్ అయ్యాడు. ఐదేళ్ల పాటు షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) బుధవారం ఆటగాళ్ల తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆప్గానిస్థాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ(Mohammad Nabi) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సుమారు 1739 రోజుల పాటు మొదటి స్థానంలో షకీబ్ అల్ హసన్ రికార్డును నబీ చిత్తు చేశాడు. దీంతో ప్రస్తుతం ఎక్కువ రోజులు వన్డే ప్రపంచ నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా మహ్మద్‌ నబీ ఘనతను సాధించాడు.


అయితే షకీబ్ దాదాపు ఐదేళ్లపాటు అగ్రస్థానంలో ఉన్నాడు. షకీబ్ 310 రేటింగ్ పాయింట్లతో ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో 39 ఏళ్ల నబీ 314 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఆప్గానిస్తాన్ ప్రారంభ మ్యాచ్‌లో 136 పరుగులు చేసిన తర్వాత నబీ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అదే పోటీలో అతను ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.

దీని కారణంగా అతను ఒక పాయింట్ సంపాదించి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 39 సంవత్సరాల 1 నెల వయస్సులో నబీ ICC ODI ఆల్ రౌండర్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన అతి పెద్ద ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల 8 నెలల తిలకరత్నే దిల్షాన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

ఇక భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా (ICC ODI ర్యాంకింగ్) బుమ్రా బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో పునరాగమనం చేసిన భారత ఆటగాడు రవీంద్ర జడేజా.. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ముందున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డే బౌలర్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక వనిందు హసరంగ (14 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌లో) ఉన్నాడు. దిల్షాన్ మధుశంక నాలుగు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌కి చేరుకున్నాడు.

Updated Date - Feb 14 , 2024 | 08:33 PM

Advertising
Advertising