India vs Australia: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు చెడు సంకేతాలు.. ఇలా తయారయ్యారేంటి
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:25 AM
త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యారు. రిజర్వ్ ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మైకేల్ నేసర్ అనే ఆసీస్ బౌలర్ ఈశ్వరన్‌ను ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 22 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షురూ కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ మొదలు కావడానికి ముందు ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియా ఏ - ఇండియా ఏ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 0, కేఎల్ రాహుల్ 4, సాయి సుదర్శన్ 0, రుతురాజ్ గైక్వాడ్ 4 స్వల్ప స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో భారత ఏ జట్టు కేవలం 11 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మైకేల్ నేసర్ అనే ఆసీస్ బౌలర్ ఈశ్వరన్‌ను ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఈశ్వరన్ విఫలమవడం వరుసగా ఇది మూడవసారి కావడం కలవరపరుస్తోంది. మొదటి అనధికారిక టెస్టులో ఈశ్వరన్ 7, 12 చొప్పున స్కోర్లు చేశాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు అతడి ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టయింది.
ఆస్ట్రేలియా ఏ - భారత్ ఏ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 4 పరుగులు సాధించి క్యాచ్ ఔట్ అయాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలంటే రెండవ ఇన్నింగ్స్‌లో మంచి ఇన్నింగ్స్ తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా కేఎల్ రాహుల్ రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 0, రెండవ ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సిరీస్‌లోని రెండు, మూడు మ్యాచ్‌ల్లో తుది జట్టులో అతడికి చోటు ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.
మరో యువ క్రికెటర్ నితీష్ రెడ్డి కూడా బ్యాట్‌తో పెద్దగా సహకారం అందించలేకపోయాడు. 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మొదటి అనధికారిక టెస్టులో 0, 17 చొప్పున స్కోర్లు, ఒక వికెట్ మాత్రమే తీశాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండవ అనధికారిక టెస్టులో వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ మాత్రమే ఆశాజనకంగా ఆడుతున్నాడు. ప్రారంభంలో భారత బ్యాటింగ్ కుప్పకూలినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జురెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తు్న్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో భారత్-ఏ జట్టు స్కోరు150 పరుగుల మార్కును దాటింది. నిజానికి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ప్రణాళికాబద్ధం ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్‌లను ఆస్ట్రేలియాకు పంపారు.
ఇవి కూడా చదవండి
ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు
గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్
మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్ కౌంటర్
వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
For more Viral News and Telugu News