ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Worldcup: రోహిత్, కోహ్లీకి ఏమైంది? వీరి వైఫల్యాలకు మేనేజ్‌మెంట్ వ్యూహాలే కారణమా?

ABN, Publish Date - Jun 21 , 2024 | 03:45 PM

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సూపర్-8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్లు, ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైఫల్యాలు మాత్రం జట్టును ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.

Virat Kohli, Rohit Sharma

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సూపర్-8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్లు, ఓపెనర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli ), రోహిత్ శర్మ (Rohit Sharma) వైఫల్యాలు మాత్రం జట్టును ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు జరిగిన న్యూయార్క్ బౌలర్లకు పూర్తిగా సహకరించడంతో ఈ ఓపెనర్లు ఏమీ చేయలేకపోయారు అనుకున్నారు. కానీ, గురువారం వెస్టిండీస్‌ పిచ్‌పై కూడా వీరు తేలిపోయారు.


అఫ్గాన్ పేసర్లు ఈ ఇద్దరు దిగ్గజాలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా రోహిత్ శర్మ టైమింగ్ సరిగ్గా కుదరక చాలా ఇబ్బంది పడ్డాడు. బౌండరీల సంగతి తర్వాత సింగిల్స్ తీయడానికి కూడా వీరు ఇబ్బంది పడ్డారు. వీరు ఆడుతున్న సమయంలో ఈ పిచ్ కూడా బౌలింగ్‌కే అనుకూలిస్తోందేమో అనే సందేహాలు వచ్చాయి. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఇక, 24 బంతుల్లో 24 పరుగులు చేసిన కోహ్లీ కూడా అవుటయ్యాక పరుగుల వరద మొదలైంది. సూర్య (Surya Kumar Yadav), హార్దిక్ (Hardik Pandya) చక్కగా పరుగులు రాబట్టారు.


నిజానికి కోహ్లీ అవుటైన తర్వాత టీమిండియా గాడిలో పడిందని చెబితే కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ నిజం అదే. కోహ్లీని ఓపెనర్‌గా పంపాలనే మేనేజ్‌మెంట్ నిర్ణయం విఫలమైంది. 35 ఏళ్ల వయసులో అలవాటు లేని ఓపెనింగ్ పాత్రకు కోహ్లీ న్యాయం చేయలేకపోతున్నాడు. కోహ్లీ కోసం ప్రతిభావంతుడైన యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఈ టోర్నీలో ఘోరంగా విఫలమవుతున్నా కోహ్లీని పక్కన పెట్టే సాహసం చేయడం లేదు.

ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేయడంలో కోహ్లీ విఫలమవుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ విభాగం భారాన్ని ఈ టోర్నీలో సూర్య, హార్దిక్‌లే మోస్తున్నారు. ప్రతిసారి వారి నుంచి అదే ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది. మరి, కీలక మ్యాచ్‌లకు ముందు అయినా కోహ్లీ, రోహిత్ మునుపటి ఫామ్ అందుకుంటారని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి..

Surya Kumar Yadav: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు సమం..!


T20 World cup: బంగ్లాదేశ్‌పై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో వికెట్లు ఎలా తీశాడో చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 21 , 2024 | 03:45 PM

Advertising
Advertising