Olympics 2036: భారత్‌లో ఒలింపిక్స్.. ఏళ్ల కల సాకారం
ABN, Publish Date - Nov 05 , 2024 | 08:58 PM
Olympics 2036: ఒలింపిక్స్ నిర్వహించాలనేది భారత్ ఎన్నాళ్లుగానో కంటున్న కల. కానీ ఇప్పటిదాకా అది నెరవేరలేదు. క్రీడాభిమానులు కూడా ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు.
క్రీడా రంగంలో భారత్ ఎన్నో అద్భుతాలు చేస్తోంది. క్రికెట్ అనే కాదు.. చాలా గేమ్స్‌లో దూసుకెళ్తోంది. పలు క్రీడలకు సంబంధించిన మెగా టోర్నీలకు దేశం ఆతిథ్యం ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకుంది. అయితే విశ్వకీడ్రలైన ఒలింపిక్స్ ఆతిథ్యానికి మాత్రం భారత్ ఇంకా నోచుకోలేదు. ఈ మెగాటోర్నీకి హోస్ట్‌గా ఉండాలనేది తీరని కోరికగానే మిగిలిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ అదృష్టం మాత్రం మనకు దక్కలేదు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ఏళ్ల కల సాకారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2036 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశాన్ని భారత్ కొట్టేయడం ఖాయమని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మోడీ చొరవతో ముందుకు..
ఒలింపిక్స్-2036, పారాలింపిక్స్ నిర్వహణకు ఆసక్తిగా ఉన్నామంటూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కి భారత్ అఫీషియల్‌గా లెటర్‌ను పంపించిందని తెలుస్తోంది. అక్టోబర్ 1వ తేదీనే ఈ లేఖను భారత ఒలింపిక్ అసోసియేషన్ పంపిందని సమాచారం. 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కుల్ని దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించిన నేపథ్యంలో తాజా లేఖ అంశం వైరల్‌గా మారింది.
ఐఓసీ ఏం చేస్తుందో?
ఆల్రెడీ 2028 (లాస్ ఒలింపిక్స్), 2032 (బ్రిస్బేన్) ఒలింపిక్స్ వేదికలు ఫైనలైజ్ అయిపోయాయి. దీంతో అందరి ఫోకస్ 2036 మీద పడింది. 2025లో జరిగే ఐఓసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. స్పాన్సర్‌షిప్స్, టెలివిజన్ రైట్స్‌తో పాటు ప్రజల ఆదరణ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే ఐఓసీ ఖజానాలో భారీ మొత్తంలో ఆదాయం సమకూరడం ఖాయం. అందుకే భారత్ వైపు కమిటీ మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
Also Read:
కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్
కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్ పేసర్‌కు ఫుల్ పవర్స్
మూలాలు మరిస్తే ఎలా..!
For More Sports And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 09:03 PM