India vs SriLanka: వన్డే సిరీస్ శ్రీలంకదే.. 110 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి!
ABN, Publish Date - Aug 07 , 2024 | 08:37 PM
సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చతికిలపడింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైంది. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చతికిలపడింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైంది. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే సరీస్‌ను శ్రీలంక 2-0తో చేజిక్కించుకుంది. మొదటి మ్యాచ్ టై అవగా, రెండు, మూడు మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (96) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ నిశాంక 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే విలవిలలాడించాడు.
దునిత్ వెల్లలాగే 5.1 ఓవర్లు వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా టీమిండియా టీమిండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (35), వాషింగ్టన్ సుందర్ (30), విరాట్ కోహ్లీ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. దునిత్ ఐదు వికెట్లు పడగొట్టగా.. వెండర్సే, మహేష్ తీక్షణ రెండేసి వికెట్లు తీశారు.
Updated Date - Aug 07 , 2024 | 08:39 PM