భారత్-బంగ్లా మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేటినుంచే
ABN, Publish Date - Oct 05 , 2024 | 02:35 AM
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలను శనివారం ప్రారంభించనున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వెల్లడించాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలను శనివారం ప్రారంభించనున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వెల్లడించాడు. టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామని, ఆఫ్‌లైన్ కౌంటర్లలో అమ్మడం లేదని చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చునని తెలిపాడు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వర్చువల్ టిక్కెట్ పత్రాన్ని ఈనెల 8 నుంచి 12వ తేదీ మధ్య సికింద్రాబాద్ జింఖానా క్రికెట్ స్టేడియంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏదైనా కార్డును చూపించి టిక్కెట్లను పొందవచ్చన్నాడు. టిక్కెట్ ప్రారంభ ధర రూ.750 కాగా, గరిష్ఠ ధర రూ.15 వేలు.
స్టాండ్ల వారీగా టిక్కెట్ల వివరాలు..
నార్త్ ఫస్ట్ లేదా సెకండ్ టెర్రస్ - రూ.750
సౌత్ వెస్ట్ లేదా ఈస్ట్ పెవిలియన్ సెకండ్ టెర్రస్ రూ.1000
సౌత్ వెస్ట్ లేదా ఈస్ట్ పెవిలియన్ ఫస్ట్ టెర్రస్- రూ.1250
ఈస్ట్ లేదా వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్- రూ.1750
ఈస్ట్ లేదా వెస్ట్ పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్- రూ.2500
ఈస్ట్ లేదా వెస్ట్ పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రీమియం లాంజ్- రూ.4000
నార్త్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్- రూ.5000
సౌత్ ఈస్ట్ లేదా వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్ - రూ.5500
నార్త్ పెవిలియన్ ఈస్ట్ లేదా వెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ -రూ.8000
సౌత్ వెస్ట్ లేదా ఈస్ట్ పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్ - రూ.9000
నార్త్ పెవిలియన్ ఈస్ట్ లేదా వెస్ట్, ఫస్ట్ లేదా సెకెండ్ ఫ్లోర్ బాక్స్ - రూ.12000
సౌత్ పెవిలియన్ ఈస్ట్ లేదా వెస్ట్, ఫస్ట్ లేదా సెకెండ్ ఫ్లోర్ బాక్స్- రూ. 15000.
Updated Date - Oct 05 , 2024 | 02:35 AM