రోహిత్, ఆకాశ్‌లకు గాయాలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 05:07 AM
ఆస్ట్రేలి యాతో నాలుగో టెస్టుకు భారత జట్టు సన్నాహకాలను ముమ్మరం చేసింది. అయితే ఆదివారం నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ ఆకాశ్ దీప్ గాయం బారినపడడం ఆందోళన కలిగిస్తోంది...
మెల్‌బోర్న్: ఆస్ట్రేలి యాతో నాలుగో టెస్టుకు భారత జట్టు సన్నాహకాలను ముమ్మరం చేసింది. అయితే ఆదివారం నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ ఆకాశ్ దీప్ గాయం బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఎంసీజీలోని అవుట్‌డోర్ ప్రాక్టీస్ ఎరీనాలో జట్టు ఆదివారం నెట్స్‌లో గడిపింది. అయితే త్రోడౌన్స్ ఎదుర్కొనేటప్పుడు రోహిత్ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. అసౌకర్యంగానే అతను బ్యాటింగ్ కొనసాగించినా కాసేపటికి ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆ తర్వాత మోకాలిపై ఐస్ ప్యాక్ ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు. అటు ఆకాశ్ చేతికి గాయమైంది. అయితే ట్రైనింగ్‌లో ఇలాంటి గాయాలు మామూలేనని, ఇందులో ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆకాశ్ తెలిపాడు. మరోవైపు ఆరో నెంబర్ బ్యాటర్‌గా రోహిత్ వ్యూహం మార్చి దూకుడుగా ఆడాలని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.
Updated Date - Dec 23 , 2024 | 05:07 AM