IPL 2024: స్వల్ప స్కోరుకే పరిమితమైన హైదరాబాద్.. లబోదిబోమంటున్న బెట్టింగ్ రాయుళ్లు!
ABN, Publish Date - May 26 , 2024 | 09:41 PM
టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్‌లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్‌లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.
తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లు కూడా రాణించకపోవడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ దారుణంగా నిరాశపరచడంతో ఆ జట్టు అభిమానులు నిరాశకు గురయ్యారు. అలాగే ఆ జట్టు తరఫున బెట్టింగ్ కాసిన వారు లబోదిబోమంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ చుట్టూ ఎన్నో అంచనాలు ఏర్పడడంతో కొన్ని వందల కోట్ల బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుండడంతో చాలా మంది భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి, కోల్‌కతా ఇన్నింగ్స్ ఏ రీతిన సాగుతుందో చూడాలి.
Updated Date - May 26 , 2024 | 09:41 PM