ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KKR vs SRH: ఈరోజే హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN, Publish Date - Mar 23 , 2024 | 12:12 PM

ఐపీఎల్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మూడో మ్యాచ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

ఐపీఎల్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మూడో మ్యాచ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ 2016 విజేత సన్ రైజర్స్ హైదరాబాద్, రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తున్నాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దాదాపు దశాబ్దం తర్వాత టైటిల్ గెలవాలని KKR అభిమానులకు కొత్త ఆశను కలిగించాడు.

మరోవైపు ఇదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కూడా కొత్త కెప్టెన్‌ని నియమించింది. ఐపీఎల్ వేలంలో పాట్ కమిన్స్‌ను రూ.20.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన పాత జట్టుతో తలపడనున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌లో కూడా మంచి స్పిన్నర్లతోపాటు బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు.


కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఐదు ఐపీఎల్ మాచుల్లో మూడు విజయాలను నమోదు చేసింది. మరోవైపు గూగుల్ అంచనా ప్రకారం ఈరోజు మ్యాచులో గెలిచే అవకాశం కేకేఆర్‌(KKR)కు 51 శాతం ఉండగా, ఎస్‌ఆర్‌హెచ్‌(SRH)కు 49 శాతం ఉందగా పేర్కొన్నారు. కానీ ఇవి అంచనాలు మాత్రమే. ఇవే ఫైనల్ కాదని గుర్తుంచుకోవాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (wicket keeper), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (captain), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హెచ్ రాణా కలరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (wicket keeper), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, పాట్ కమిన్స్ (captain), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని

Updated Date - Mar 23 , 2024 | 12:14 PM

Advertising
Advertising