వాడేసిన పిచ్‌లా?
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:07 AM
నాలుగో టెస్ట్‌కు ముందు తమకు కల్పించిన ప్రాక్టీస్ పిచ్‌లపై భారత జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేసింది. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ అయ్యిందని, అందువల్ల సాధన సందర్భంగా కెప్టెన్ రోహిత్‌కు....
ప్రాక్టీస్ వికెట్లపై భారత్ అసంతృప్తి
మెల్‌బోర్న్: నాలుగో టెస్ట్‌కు ముందు తమకు కల్పించిన ప్రాక్టీస్ పిచ్‌లపై భారత జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేసింది. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ అయ్యిందని, అందువల్ల సాధన సందర్భంగా కెప్టెన్ రోహిత్‌కు మోకాలి గాయం అయిందని పేర్కొంది. కానీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) క్యూరేటర్ మ్యాట్ పేజ్ మాత్రం నిబంధనల మేరకే ప్రాక్టీస్ పిచ్‌లను ఏర్పాటు చేశామని సమర్థించుకున్నాడు. ఆదివారం సాధన సందర్భంగా త్రోడౌన్‌ను ఎదుర్కొనే క్రమంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తాకిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత జట్టు సోమవారం ప్రాక్టీస్ చేయకూడదని నిర్ణయించుకుంది. నిబంధనలను అనుసరించి టెస్ట్ మ్యాచ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే క్యూరేటర్ కొత్త ప్రాక్టీస్ పిచ్‌ను భారత్‌కు కేటాయించాల్సి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ఈనెల 26న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ‘టెస్ట్ మూడు రోజుల్లోకి వచ్చేసింది. దాంతో కొత్త పిచ్‌లను రూపొందించా. మూడు రోజులకంటే ముందే జట్టు ప్రాక్టీ్‌సకు వస్తే..ఉపయోగించిన పిచ్‌లనే కేటాయిస్తాం’ అని పేజ్ వివరించాడు.
‘ఎంసీజీ’ పేసర్లకు అనుకూలం: పెర్త్, అడిలైడ్ వికెట్ల మాదిరి ఎంసీజీ పిచ్‌పై అంత బౌన్స్ ఉండదట. కానీ వికెట్‌పై ఆరు మి.మీ.మేర పచ్చిక ఉండడంతో పేసర్లకు అనుకూలించనుంది. స్పిన్నర్లకు సహకరించేలా పిచ్‌పై పగుళ్లు ఉండబోవని పేజ్ స్పష్టంజేశాడు. కొత్త బంతి మెరుపు తగ్గాక బ్యాటర్లకు సహకరిస్తుందని తెలిపాడు.
షమికి నిరాశ
భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న వెటరన్ పేసర్ షమికి మళ్లీ నిరాశే ఎదురైంది. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్ట్‌లకు అతడిని ఎంపిక చేయడంలేదని బీసీసీఐ సోమవారం ప్రకటించింది.
Updated Date - Dec 24 , 2024 | 06:07 AM