ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భాకర్‌కు చోటు లేదా?

ABN, Publish Date - Dec 24 , 2024 | 06:03 AM

దేశ క్రీడా రంగ ప్రతిష్ఠాత్మక అవార్డు ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న విజేతలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ పురస్కారానికి సిఫారసు చేసిన జాబితాలో పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు...

ఖేల్‌రత్న అవార్డు నామినేషన్లపై వివాదం

న్యూఢిల్లీ: దేశ క్రీడా రంగ ప్రతిష్ఠాత్మక అవార్డు ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న విజేతలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ పురస్కారానికి సిఫారసు చేసిన జాబితాలో పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ పేరు లేకపోవడం సంచలనం రేపుతోంది. ఈసారి ఖేల్‌రత్న అవార్డుకు హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారిస్‌ పారా ఒలింపిక్స్‌ హైజం్‌పలో స్వర్ణం నెగ్గిన ప్రవీణ్‌ కుమార్‌ తదితరుల పేర్లను సిఫారసు చేశారు. కానీ భాకర్‌ పేరు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే మనూభాకర్‌ స్వంతంగాకానీ, భారత రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) కానీ ఈ పురస్కారానికి దరఖాస్తు చేయలేదని క్రీడాశాఖ స్పష్టంజేసింది. మరోవైపు ఖేల్‌రత్న అవార్డుకు దరఖాస్తు చేయాల్సిన బాధ్యత భాకర్‌దేనని ఎన్‌ఆర్‌ఏఐ చీఫ్‌ నారాయన్‌ సింగ్‌ దేవ్‌ తెలిపారు. ఆమె దరఖాస్తు చేయకపోవడంతో..భాకర్‌ పేరును జాబితాలో చేర్చాలని క్రీడాశాఖను కోరినట్టు కూడా దేవ్‌ చెప్పారు. మనూ భాకర్‌ తండ్రి రామ్‌కిషన్‌ భాకర్‌ మాత్రం తాము దరఖాస్తు చేశామని చెబుతుండడం గమనార్హం.


కాగా..దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీకి దరఖాస్తు చేయాలనుకుంటున్నందున, షూటర్‌ కుటుంబం ఖేల్‌రత్న దరఖాస్తును పట్టించుకోలేదనే వాదనా వినిపిస్తోంది. మరోవైపు, ఽఖేల్‌రత్న అవార్డీల పేర్లు ఖరారు కాలేదని, తన వద్దకు వచ్చిన జాబితాలో మనూభాకర్‌ పేరును మంత్రి మాండవీయ చేరుస్తారని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ క్రీడా అవార్డులకు అథ్లెట్లను ఎంపిక చేయనుంది.

Updated Date - Dec 24 , 2024 | 06:03 AM