ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా హవా.. అశ్విన్ ఆల్ టైం రికార్డు సమం..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:20 PM

జస్ప్రీత్ బుమ్రా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ఆధిక్యం ప్రదర్శించాడు. ఇప్పటికే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న బుమ్రా తాజాగా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.

Jasprit Bumrah

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) తన ఆధిక్యం ప్రదర్శించాడు. ఇప్పటికే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న బుమ్రా తాజాగా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. గబ్బా టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్న బుమ్రా ఈ వారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 904 రేటింగ్ పాయింట్స్ (Test Rating Points) సాధించాడు.


టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన అశ్విన్ రికార్డును తాజాగా బుమ్రా సమం చేశాడు. ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ 2016 డిసెంబర్‌లో 904 రేటింగ్ పాయింట్స్‌ సాధించాడు. అత్యధిక టెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అతడిని తాజా టెస్ట్ సిరీస్ ప్రదర్శనతో బుమ్రా సమం చేశాడు. ఇక, మరో భారత్ బౌలర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు పాయింట్లు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు. ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ ఒక్కడే టాప్ టెన్‌లో కొనసాగుతున్నాడు. జైస్వాల్ ఒక స్థానం దిగజారి ప్రస్తుతం ఐదో ర్యాంకుకు పడిపోయాడు.


ఇక, మిగిలిన వారిలో రిషభ్ పంత్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంకుకు, శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 20వ ర్యాంకుకు, కోహ్లీ ఒక స్థానం దిగజారి 21వ ర్యాంకుకు, రోహిత్ శర్మ ఐదు స్థానాలు దిగజారి 35వ ర్యాంకుకు పడిపోయారు. కాగా, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసిన టీమిండియా గురువారం నుంచి నాలుగో టెస్ట్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2024 | 04:20 PM