Jay Shah: ఇషాన్ కిషన్ రంజీ మ్యాచ్ ఆడాల్సిందే..?
ABN, Publish Date - Feb 15 , 2024 | 07:53 AM
టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ వైఖరిపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనలను ఇషాన్ కిషన్ లెక్క చేయలేదు. ఆ వెంటనే బీసీసీఐ సెక్రటరీ జై షా రంగంలోకి దిగారు. ఇషాన్ కిషన్ పేరు ప్రస్తావించకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ వైఖరిపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) సూచనలను ఇషాన్ కిషన్ లెక్క చేయలేదు. తిరిగి టీమ్‌లోకి రావాలంటే దేశవాళి క్రికెట్ ఆడాలని ద్రావిడ్ సూచించారు. రంజీ ట్రోఫిలో ఆడాలని కోరారు. తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్ పేరు తొలగిస్తారనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే బీసీసీఐ సెక్రటరీ జై షా రంగంలోకి దిగారు. ఇషాన్ కిషన్ పేరు ప్రస్తావించకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
జై షా ఏమన్నారంటే..?
టీమిండియా టీమ్‌కు ఆడకుండా ఉన్న యంగ్ ప్లేయర్లు దేశవాళి క్రికెట్ ఆడాలని, తమ ప్రతిభను మెరుగు పరచుకోవాలని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. యంగ్ ప్లేయర్స్ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు ఆ టోర్నీలు పనిచేస్తాయని తేల్చి చెప్పారు. రంజీ ట్రోఫిల్లో ఆడాలని ఆటగాళ్లకు స్వయంగా తాను రేపు (శుక్రవారం) లేఖ రాస్తానని జై షా వివరించారు. ‘దేశవాళి క్రికెట్ ఆడాలని కెప్టెన్, కోచ్ చెబితే తప్పకుండా ఆడాలి. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న ప్రతి క్రికెటర్‌కు ఆ ఆదేశాలు వర్తిస్తాయి. గాయపడిన క్రీడాకారులను మాత్రం ఆడాలని ఒత్తిడి తీసుకురాం. టీమిండియాలోకి తిరిగి రావాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. యువ క్రికెట్లరు అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. బీసీసీఐతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లు అందరికీ నియమాలు వర్తిస్తాయి అని’ జై షా స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రకటించిన కొత్త సెలక్టర్‌ను త్వరలో నియమిస్తామని జై షా వెల్లడించారు.
టార్గెట్ ఇషాన్ కిషన్..?
జై షా చేసిన కామెంట్స్ ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి చేసినవని స్పష్టమవుతోంది. ఇంగ్లాండ్ టూర్‌లో రెస్ట్ కావాలని కిషన్ కోరారు. దేశవాళి క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన సూచనలను పాటించలేదు. దాంతో వివాదం మొదలైంది. తర్వాత జై షా రంగంలోకి దిగారు. పైకి యువ ప్లేయర్లు అని చెబుతున్నారు. టార్గెట్ కిషన్ అని స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 15 , 2024 | 07:55 AM