ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Team India Coach: టీమిండియా కోచ్ చాలా రాజకీయాలు ఎదుర్కోవాలి.. రాహుల్ సూచనను మర్చిపోలేను: జస్టిన్ లాంగర్

ABN, Publish Date - May 24 , 2024 | 04:45 PM

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చెపట్టేదెవరనే ఉత్కంఠ చాలా మందిలో ఉంది. కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం

Justin Langer

రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత టీమిండియా హెడ్ కోచ్ (Team India Coach) పదవిని చెపట్టేదెవరనే ఉత్కంఠ చాలా మందిలో ఉంది. కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ (Justin Langer) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు బీసీసీఐ (BCCI) వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో జస్టిన్ లాంగర్ తన అభిప్రాయాన్ని తాజాగా వెల్లడించాడు. ఈయన ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL 2024) లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ విషయంలో కేఎల్ రాహుల్ (KL Rahul) తనకు ఓ సూచన చేసినట్టు లాంగర్ తెలిపాడు.


``జాతీయ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించడం తేలికైన విషయం కాదు. ఆస్ట్రేలియా జట్టుకు నాలుగేళ్లు ప్రధాన కోచ్‌గా ఉన్నా. చాలా అలసిపోయా. ప్రస్తుతం ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌కు కోచ్‌గా పని చేస్తున్నా. టీమిండియా కోచ్‌గా ఎంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్ రాహుల్ నాకు చెప్పాడు. ఐపీఎల్‌లో పోల్చుకుంటే టీమిండియా కోచ్ వెయ్యి రెట్ల రాజకీయాలను ఎదుర్కోవాలి అని చెప్పాడు. అది నిజమేనని నమ్ముతున్నా. టీమిండియా కోచ్‌గా ఉండే వ్యక్తి ఏ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కోవాలో ఊహించగల``ని లాంగర్ పేర్కొన్నాడు.


ద్రవిడ్ తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్‌గా వచ్చే వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు బాధ్యతలు నిర్వర్తించాలి. ఒక సంవత్సరంలో పది నెలల పాటు జట్టుతోనే కొనసాగాలి. కాగా, మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ రికీ పాంటింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే తను ఆ పదవికి ప్రస్తుతానికి ఫిట్ కాలేనని, ప్రస్తుత తన లైఫ్‌స్టైల్ ప్రకారం అంత సమయం వెచ్చించలేనని రికీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2024: ఫైనల్ చేరే రెండో జట్టేది? సమరానికి సిద్ధమవుతున్న రాజస్థాన్, హైదరాబాద్ జట్లు.. ఒకవేళ వర్షం పడితే..


Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 24 , 2024 | 04:45 PM

Advertising
Advertising