ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

swimming : ఆసీస్‌ చేపకే చిక్కింది

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:47 AM

స్విమ్మింగ్‌ సంచలనం కేలీ మెక్యూయెన్‌ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్‌.. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్‌ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్‌సలోనూ సత్తాచాటుతూ

ఆసీస్‌ చేపకే చిక్కింది

100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న కేలీ

రెగాన్‌ స్మిత్‌కు రజతం

స్విమ్మింగ్‌ సంచలనం కేలీ మెక్యూయెన్‌ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్‌.. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్‌ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్‌సలోనూ సత్తాచాటుతూ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌ రేసును కేలీ 57.33 సెకన్లలో ముగించి వరుసగా రెండోసారి పసిడి పటే ్టసింది. ఇక, గతనెల యూఎస్‌ ట్రయల్స్‌లో 57.13 సెకన్ల టైమింగ్‌తో కేలీ పేరిటనున్న ప్రపంచ రికార్డు (57.33 సె)ను బద్ధలుకొట్టి ఫేవరెట్‌గా పారి్‌సలో అడుగుపెట్టిన అమెరికా స్టార్‌ రేగన్‌ స్మిత్‌.. అసలు పోటీకొచ్చేసరికి తేలిపోయింది. రేగన్‌ స్మిత్‌ ఫైనల్‌ రేసులో 57.66 సెకన్లతో రజత పతకానికి పరిమితమైంది. కాగా, టోక్యో క్రీడల్లో కాంస్యంతోనే సరిపెట్టుకున్న 22 ఏళ్ల స్మిత్‌ ఈసారి మాత్రం పతక ప్రదర్శనను మెరుగుపరచుకోవడం విశేషం. అమెరికాకే చెందిన కేథరిన్‌ బెర్కాఫ్‌ (57.98 సె)కు కాంస్యం దక్కింది.

Updated Date - Aug 01 , 2024 | 12:47 AM

Advertising
Advertising
<