ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో.. పాక్ ఆటగాడు బాబర్ ఆజామ్‌కు మాజీ ఆటగాడి సూచనలు..

ABN, Publish Date - Sep 15 , 2024 | 02:40 PM

ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై కూడా పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ వరుస ఓటములతో డీలా పడిన సంగతి తెలిసిందే.

Babar azam, Virat Kohli,

ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై కూడా పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ వరుస ఓటములతో డీలా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు సభ్యులపై మాజీలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్‌ (Babar azam)పై విమర్శల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆజామ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ (Younis Khan) కీలక సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ కంటే వ్యక్తిగత ప్రదర్శనపైనే దృష్టి సారించాలని సూచించాడు.


``సోషల్ మీడియాలో అభిమానులు చాలా పోస్ట్‌లు పెడుతుంటారు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి. బాబర్ ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. బాబర్ చాలా చిన్న వయసులోనే ఎన్నో సాధించాడు. కెప్టెన్సీ అనేది చాలా చిన్న విషయం. ఆటగాడిగా వ్యక్తిగత ప్రదర్శన పైనే బాబర్ దృష్టి సారించాలి. విరాట్ కోహ్లీని చూసి బాబర్ చాలా నేర్చుకోవాలి. కెప్టెన్‌గా వైదొలిగి ఆటగాడిగా కొనసాగాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులు సాధించాడ``ని యూనిస్ ఖాన్ అన్నాడు.


``కెప్టెన్‌గా కొనసాగడం కంటే దేశానికి ప్రాతినథ్యం వహించడమే గొప్ప విషయం అని బాబర్ తెలుసుకోవాలి. తన మీద ఉన్న ఒత్తిడిని అతడు అర్థం చేసుకోవాలి. పరుగులు చేయడమే తన ముందున్న లక్ష్యమని బాబర్ గుర్తించాలి`` అంటూ యూనిస్ ఖాన్ అన్నాడు. గత వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్.. ఇలా పాకిస్తాన్ వరుస పరాజయాలతో విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీని కోల్పోయిన బాబర్.. త్వరలోనే వన్డే కెప్టెన్సీ హోదాను కూడా కోల్పోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Tejashwi Yadav: విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు.. ఆసక్తికర ట్వీట్ చేసిన బీహార్ నేత తేజస్వి యాదవ్..


Longest Test match: 11 రోజులు.. 680 ఓవర్లు.. అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలు తెలిస్తే..


Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు


Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 02:43 PM

Advertising
Advertising