KL Rahul-LSG: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్‌పై ట్రోలింగ్.. కారణం ఇదే
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:55 AM
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే యాజమాన్యం అట్టిపెట్టుకుంది.
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. అయితే ఆటగాళ్ల రిటెన్షన్‌పై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
గోయెంకా ఏమన్నారంటే..
‘‘విజయం సాధించాలనే మనస్తత్వం ఉన్న ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాం. ఆటగాళ్లు వారి వ్యక్తిగత లక్ష్యాలు, వ్యక్తిగత ఆకాంక్షల కంటే జట్టు ముఖ్యమనే సాధారణ ఆలోచనతో రిటెయిన్ విషయంలో ముందుకెళ్లాం. మా మొదటి రిటెయిన్ ఆటోమేటిక్ ఎంపిక. రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే జరిగింది. నిలుపుదల చేసుకున్న ఆటగాళ్లలో ఇద్దరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీ ఉన్నారు. గత సీజన్‌లో ఆడిన ముగ్గురు బౌలర్లతో ముందుకు వెళ్లాం. ఆ ముగ్గురూ భారతీయులే. ఇక పూరన్ అందరి ఛాయిస్. ఆయుష్ బదోని 6 లేదా 7వ స్థానాల్లో బాగా ఆడుతున్నాడు’’ అని గోయెంకా పేర్కొన్నారు.
రిటెన్షన్ ఎంపిక ప్రక్రియలో జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, క్రికెట్ అనలిస్ట్, సీఈవో భాగమయ్యారని గోయెంకా అన్నారు. రిటెన్షన్ జాబితా విడుదల చేయడానికి ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే వ్యక్తిగత లక్ష్యాలు, వ్యక్తిగత ఆకాంక్షలు అంటూ సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యపై సోషల్ మీడియాలో ఆయనను క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి చేశారని అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది వెర్రి మాట అని వ్యాఖ్యానించారు. రిటెయిన్ చేసుకోని ఆటగాళ్లందరినీ బస్సు కిందకు తోసేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక కేఎల్ రాహుల్‌ను రెండు సార్లు కలిశారని, రిటెయిన్ ఆఫర్ కూడా ఇచ్చారని, కానీ ఇప్పుడుమాత్రం గెలుపు మనస్తత్వం కాదంటున్నారని ఓ నెటిజన్ మండిపడ్డాడు. వ్యక్తిగత ఆకాంక్షలు అనే మాట ఇప్పుడు ఎందుకు అంటున్నారని ప్రశ్నించాడు. ‘మీ వ్యక్తిగత ఆకాంక్ష కోసం ఈ మాట అంటున్నారా’ అని ఒక వ్యక్తి చురక అంటించాడు.
కాగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ శైలి కారణంగానే రిటెయిన్ చేసుకోలేదని లక్నో సూపర్ జెయింట్స్ వర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్ల ప్రదర్శన మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని అంటున్నారు. రాహుల్ బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. కాగా రాహుల్ క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ బంతులు ఆడుతున్నాడని, ఆ విధానం మ్యాచ్‌పై ప్రభావం చూపుతోందని లక్నో వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Nov 01 , 2024 | 08:00 AM